ఆపిల్‌ తొక్క కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మ సౌందర్యానికి కూడా ఆపిల్‌ తొక్కలు ఉపయోగపడతాయి. యాపిల్‌ తొక్కల తో చేసే  ఫేస్‌ ప్యాక్‌తో చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయొచ్చు. ఇంతకీ ఫేస్‌ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? దీంతో కలిగే ఎన్నో ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఆపిల్‌ తొక్కతో ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవడానికి ముందుగా  పండు నుంచి తొక్కలను తీయాలి. ఆ తర్వాత తొక్కలను కొన్ని రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. అనంతరం తొక్కలు బాగా ఎండిన తర్వాత వాటిని పొడిగా చేసుకోవాలి. ఇంకా రెండు చెంచాల పౌడర్‌కు ఒక చెంచా మెత్తగా రుబ్బిన ఓట్‌ మీల్‌ పౌడర్‌ను యాడ్‌ చేయాలి. తరువాత ఇందులో కొంచెం తేనెను కలపి ఒక పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. మళ్ళీ ఈ పేస్ట్‌ను ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంతో పాటు ముఖమంతా అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. 


ఇలాచేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారుతుంది.ఇక యాపిల్ తొక్కలతో మరో రకంగా కూడా ఫేస్‌ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల యాపిల్‌ తొక్క పొడిని తీసుకోవాలి. తరువాత అందులో కొంచెం పాలను యాడ్‌ చేసి పేస్ట్‌ లాగ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంతో పాటు, మెడపై అప్లై కూడా చేసుకోవచ్చు చేసిన 20 నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా గోరు వెచ్చని నీటి తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్‌గా, సున్నితంగా మారుతుంది. యాపిల్‌ తొక్కలోని విటమిన్‌ ఎ, విటమిన్ సి,విటమిన్ ఇ, విటమిన్ కె లు చర్మాన్ని తేమగా మార్చడంలో ఉపయోగడపతాయి. అలాగే మచ్చలు, మొటిమలు తగ్గించడంలో ఉపయోగతాయి. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి.రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజూ యాపిల్ తింటే వైద్యుల దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు సైతం చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: