మీ ఇంట్లో వంట కోసం వాడుతున్న గ్యాస్ సిలిండర్ను ఎప్పటికప్పుడు తనకి చేయండి . అది లీక్ అవుతుందో లేదో చూడండి . వంట సిలిండర్ చెక్ చేసినప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నట్లు మీకు అనిపిస్తే , రెగ్యులేటర్ తో దాన్ని ఆపేయండి . మీ సిలిండర్ను సరిగ్గా ఉపయోగించండి . బర్నర్ ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి . అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది . మీ ఇంట్లో మీరు ఉపయోగిస్తున్న సిలిండర్ లో తక్కువ గ్యాస్ ఉంటే , దానిపై తడి పాత్రలను ఎప్పుడూ ఉపయోగించవద్దు . ఇంట్లో గ్యాస్ స్టవ్ పై కూరగాయలు లేదా ఏదైనా తయారు చేసేటప్పుడు ఎల్లప్పుడూ వాటిపై మూత పెట్టి కవర్ చేయండి . అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ వెలిగించి పెట్టుకోండి .
వంట చేసే సమయంలో అన్ని వస్తువులు దగ్గర పెట్టుకుని వంట ప్రారంభించారు . వస్తువులన్నీ దగ్గర పెట్టుకుని వంట మొదలుపెడితే గ్యాస్ అనేది అసలు అవ్వదు . లేదంటే వంట సరుకులు తెచ్చుకోకుండా గ్యాస్ దగ్గర కూర్చుంటే గ్యాస్ అనేది ఎక్కువగా అయిపోతుంది . ఎందుకంటే .. మనం వంట సామానం తెచ్చుకోకుండా కూర్చుంటే అవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది . కాబట్టి గ్యాస్ త్వరగా అయిపోతుంది. అందుకని మనం గ్యాస్ మీద ఏ పని చేయాలనుకున్నా దగ్గర పెట్టుకుని చేయాలి. లేదంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది.