సగ్గు బియ్యం తినటం వల్ల శరీరానికి చలువ. వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో మంచిది. ఇన్ని పోషకాలు ఉన్న సగ్గుబియ్యంతో దోశలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సగ్గుబియ్యం దోసలు తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి..మంచినీరు వేసి ఓ రెండు గంటల ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత నీళ్లు వం పేయకుండానే..ఇందులో శగపిండి , బియ్యం పిండి , ఉప్పు వేసి బాగా కలపాలి. దోశ బ్యాటర్ కాస్త ముందుగా ఉండాలి . మరి పలచగా ఉండే దోసలు రావు. ఆ తరువాత ఇందులో పచ్చి మిర్చి ముక్కలు , అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు , జీలకర్ర , కొత్తిమీర కలిపి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశలన్నీ టమాటా చట్నీ , కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. కావాలంటే మీరు పెరుగు , కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలిపి అయినా దోసెలు వేసుకోవచ్చు. ఇలా అయినా రుచిగా ఉంటుంది. ఈ దోశలు చాలా బాగుంటాయి తినటానికి. కాబట్టి అందరూ కూడా ఈ దోశలని తప్పకుండా ట్రై చేయండి .