ఈరోజుల్లో చాలామంది పురుషులలో జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి!. జుట్టు విషయంలో అబ్బాయిలు కొంతమంది శ్రద్ధ పెట్టరు. దీనివల్ల వెంట్రుకలు రాలే ప్రమాదం ఉంది. ఆఖరికి దీనిని తగ్గించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారు ఈ సింపుల్ చిట్కాలు పాటించటం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. అవేంటో తెలుసుకుందాం. కోడిగుడ్డులో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే బయోటిన, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి.


ఇది జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మార్చటంలో సహాయపడతాయి. అందువల్ల మీ డైట్ లో కోడిగుడ్డును చేర్చుకోవడం మంచిది. అలోవెరా జెల్ చర్మం సౌందర్యంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది. వీటిలోనే ప్రోటీన్స్, విటమిన్లు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. జిన్సెంగ్ అనే ఔషధ మూలికలో జీన్సె నో సైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపర్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చేప నూనెలో ఒమేగా-3,6 ఫ్యాటి యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను మెరుగు పరుస్తాయి.


జుట్టు రాలటాన్ని నివారించి వెంట్రుకలు బొద్దుగా పెరిగేలా చేస్తాయి. చాలామంది అబ్బాయిలకు జుట్టుకు నూనె పెట్టడం ఇష్టం ఉండదు. అయితే మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే నూనెతో మసాజ్ చేయటం మంచిది. దీనివల్ల కుదుళ్ళకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు రాలటం తగ్గుతుంది. వెంట్రుకలు నల్లగా, మెరిసేలా ఉంటాయి. ఉల్లిపాయ రసం కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటంలో సహాయపడుతుంది. కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపరచటంలో సహాయపడుతుంది. కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆర్గాన్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మంతో పాటు జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనికోసం వెంట్రుకలను ఆర్గాన్ ఆయిల్ లో మసాజ్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: