మహిళలు వీటిని తీసుకుంటే ఆ బాధలన్నీ మాయం ... ?

మహిళలకి బలమైన ఆహారం అనేది కచ్చితంగా చాలా అవసరం. కాబట్టి వాళ్ళు బలమైన ఆహారాలని కచ్చితంగా తీసుకోవాలి. మహిళలకి ఐరన్‌ అనేది చాలా అవసరం. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి నల్ల ఎండుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కడుపును శుభ్రపరచడానికి, అధిక పిత్తాన్ని తగ్గించడానికి, శరీరానికి పోషకాలను అందించడానికి ఇంకా అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మహిళలకు నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కండరాలు, ఎముకల ఆరోగ్యానికి అలాగే నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నువ్వులు అసమతుల్యత సమస్యల కారణంగా మహిళల్లో పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పిత్త, ఆర్థరైటిస్ సమస్యల నుంచి శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని, థైరాయిడ్ సమస్యలను నిర్వహించడంలో కొబ్బరి ప్రభావవంతంగా పనిచేస్తుంది.


అందుకే మహిళలు  ప్రతిరోజూ ఒక చిన్న కొబ్బరి ముక్క తినాలి.బలహీనత నుంచి రక్తహీనత సమస్య వరకు అన్నింటికీ ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. మహిళలు వీటిని తీసుకుంటే ఆ బాధలన్నీ మాయం..కాబట్టి ఖర్జూరాలను సూపర్‌ఫుడ్‌గా మహిళలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది బరువు పెరుగుట, అలసటను తగ్గించడం, ఐరన్ స్థాయిలను పెంచడం, క్రమరహిత పీరియడ్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తుంది.చాలా సార్లు మహిళలు పీరియడ్స్ లేదా మెనోపాజ్ కారణంగా అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. ఇలా పైన చెప్పిన సాధారణ ఆహారాలతోనే ఐరన్ లోపాన్ని ఈజీగా అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా ఉసిరికాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళలకే కాకుండా పిల్లలు, వృద్ధులతో సహా అన్ని వయసుల వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో పచ్చి ఉసిరి లేదా ఉసిరి పొడి లేదా ఉసిరి రసం ఏదైనా తీసుకొవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: