మన ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ అలవాటుని మనం పాటించకూడదు. మన ఆరోగ్యాన్ని పాడు చేసే అత్యంత హనికరమైన అలవాటు స్మోకింగ్‌.. ఇది మన ఆరోగ్యాన్ని చాలా వేగంగా దెబ్బ తీస్తుంది. ఈ స్మోకింగ్ వల్ల మన జీవితకాలం క్రమంగా తగ్గుతుంది. అందుకే 100 ఏళ్ళు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే కచ్చితంగా స్మోకింగ్‌ మానేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మనం తీసుకునే ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, చేపలు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే ఈ ఆహారాలు శరీరానికి, రోగనిరోధక శక్తి పనితీరు, మీ మొత్తం ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.అలాగే అధిక రక్తపోటు అనేది అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల, మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవటం ఆరోగ్యానికి మంచిది. అందుకే వైద్యుడిని సంప్రదించండి. ఇంకా అలాగే ప్రతి రోజూ పెంపుడు జంతువులతో కొంత సమయం గడపడం వల్ల ఒత్తిడి చాలా ఈజీగా తగ్గుతుంది. మీ మూడ్ కూడా బాగుంటుంది. 


పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసే వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దోస, దోక్లా ఇంకా పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలు మీ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ జీవితకాలం అనేది పెరుగుతుంది.అలాగే పప్పులు, వోట్స్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ వంటి తృణధాన్యాలు తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుంది. వాటిలో అధిక మొత్తంలో ఫైబర్ అనేది ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.మంచి నిద్ర అనేది మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు ఫోన్ లేదా కంప్యూటర్ వాడకాన్ని కచ్చితంగా తగ్గించండి. ఇంకా అలాగే రెగ్యులర్‌గా యోగా చేయడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. యోగా, లోతైన శ్వాస, ధ్యానం వంటివి వ్యాయామాలు మెదడుకు స్పష్టతను, జ్ఞాపకశక్తిని, మంచి దృష్టిని అందిస్తాయి. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితం అంత చక్కగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: