మనం మానసికంగా ఫిట్‌గా లేకుంటే శారీరకంగా కూడా ఫిట్‌గా లేమనే అర్ధం చేసుకోవాలి. ఇక ఈ విషయాన్ని వైద్య నిపుణులు, పెద్దలు చెప్పడం మీరు తరచూ వినే ఉంటారు. మన మానసిక శారీరక ఆరోగ్యానికి మధ్య కచ్చితంగా సంబంధం ఉంది. ఒత్తిడి ఎదురుకుంటున్న సమయంలో ఎవరైనా సరే ఎక్కువగా అలసిపోతారు. మీకు ప్రతికూల ఆలోచనలు వస్తే, మీరు కచ్చితంగా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. నిజానికి ప్రతికూల (నెగిటివ్ థింకింగ్) ఆలోచన అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అతి ఆలోచన ఒత్తిడిని పెంచుతుంది. కండరాలలో నొప్పి.. దృఢత్వాన్ని బలహీనపర్చడం లాంటివి కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వెన్ను, మెడ నొప్పి సమస్యను కూడా ఎదుర్కోవచ్చు. నెగటివ్ ఆలోచనల వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా, సంక్రమణ లేదా తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. 


కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.అంతేగాక నెగటివ్ గా ఆలోచించడం కచ్చితంగా డిప్రెషన్‌కు దారి తీస్తుంది. దీని కారణంగా, శరీరంలోని చాలా హార్మోన్ల స్థాయి క్షీణిస్తుంది. అలాంటి పరిస్థితిలో, మీ థైరాయిడ్, మధుమేహం, వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తెలిసిన విషయం ఏమిటంటే.. చాలా నెగటివ్ గా ఆలోచించడం అనేది ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. దీని కారణంగా, శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె వేగవంతంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి.మీరు సానుకూలంగా ఆలోచిస్తే (పాజిటివ్ థింకింగ్)  మీరు మరింత చురుకుగా ఉంటారు. అందుకే.. నెగిటివ్ థింకింగ్ అస్సలు వద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నెగటివ్ గా ఆలోచిస్తే సరిగ్గా ఆకలవ్వాదు. కాబట్టి చాలా వీక్ అయిపోతారు.కాబట్టి ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండటానికి ట్రై చెయ్యండి. అప్పుడే ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: