ఇంట్లో దోమలు బెడదా ఉంటే రాత్రంతా నరకమే. ఒక్కసారి కుట్టాయంటే ఇక గోక్కుంటో ఉండాల్సిందే. అయితే కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా మీరు దోమలను ఈజీగా తరిమికొట్టవచ్చు. పచ్చ కర్పూరాన్ని ఏ నూనెలో అయినా కలిపి దానితో దీపం పెడితే దోమలు రావు. దీని కోసం ఇంటి తలుపులు మూసి కర్పూరం వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించిన అరగంట తర్వాత తలుపులు, కిటికీలు తెరవండి. కర్పూరం వాసన దోమలను ఆకర్షించదు.కర్పూరం దోమల్ని సులభంగా బయటకు పంపుతుంది.అలాగే టీ ట్రీ ఆయిల్ యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇంట్లో ఈజీగా దోమలను తగ్గిస్తుంది. 10 నుంచి 15 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను ఒక 30 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెతో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరమంతా కూడా అప్లై చేయాలి. ఇలా చేస్తే దోమలు మీ దగ్గరకు కూడా రాకుండా పారిపోతాయి. అలాగే లెమన్ గ్రాస్ కూడా దోమలు రాకుండా అడ్డుకుంటుంది.

దోమలను తరిమికొట్టేందుకు కొన్ని రకాల నూనెలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో మీరు 3 టేబుల్ స్పూన్ల బాదం నూనె లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్స్ లో నింపుకుని రోజుకు రెండు సార్లు ఉదయం, రాత్రి పూట ఇంట్లో కొడితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే వేప నూనె కూడా దోమలను ఈజీగా అడ్డుకుంటుంది. ఇందుకోసం 10-12 చుక్కల వేపనూనెను 30 మిల్లీ లీటర్ల కొబ్బరినూనెలో కలిపి శరీరమంతా అప్లై చేయాలి. అలాగే, దాల్చిన చెక్కతో చేసిన నూనె దోమలను దూరం చేస్తుంది. దోమల వల్ల కలిగే దద్దుర్లను తగ్గిస్తుంది.లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రాకుండా మంచి చేస్తోంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4-5 చుక్కల వెనీలా ఎసెన్స్, 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో తీసుకుని చేతులు, కాళ్లకు బాగా స్ప్రే చేయాలి. దోమలు కుట్టకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: