ఐక మత్యమే మహా బలం. దీనిని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చాలా సార్లు చదువుకున్నాం. మంచి మాట లెక్క నేర్చుకున్నాం. చాలా సందర్భాల్లో ఐక్య మత్యంగా ఉంటే కలిగే లాభాలపై పలు రకాల కథలు నేర్చుకున్నాం. కానీ పెద్దయైన తర్వాత సమాజంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగం ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది.


సాటి మనిషి ఏమైపోయినా ఫర్వాలేదు. మేం మాత్రం హ్యాపీగా ఉంటే చాలు. అనే రీతిలోనే సాగుతోంది  ప్రస్తుత సమాజంలోని వ్యవహారం. సొంత అన్నదమ్ముల మధ్య కూడా ఐకమత్యం లేని ఈ రోజుల్లో జంతువులను చూసి జనం నేర్చుకోవాలి. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. దీని గురించి మనం తప్పుకుండా తెలుసుకోవాలి. వీలైతే ఆచరించాలి.


ఆ జంతువే తోడేలు. అవును… మనం వింటూనే ఉంటాం. తోడేళ్ల గుంపు. రాజకీయ నాయకులు కూడా పలు సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ప్రత్యర్థులంతా తోడేళ్ల గుంపులాగా వస్తున్నారు. నేను మాత్రం సింగిల్ అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తోడేళ్ల ఐకమత్యం గురించి. వీటికి ఉన్న క్రమశిక్షణ మరే జంతువుకి లేదు. పక్క దానికి ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడతాయి. గుంపుగా చలించే జీవులు ఏవైనా ఉన్నాయంటే అవి తోడేళ్లు మాత్రమే.


తోడేళ్ల గుంపునకు ఎదురు వెళ్లాలంటే ఏనుగులు భయపడతాయి. అడవికి రాజైన సింహం కూడా ఆలోచిస్తుంది. వాటిని కూడా తరిమేయగల శక్తి ఈ గుంపునకు ఉంది. ఒక్కొక్కటిగా అయితే దేనిని ఎదురించలేరు. వీటిని చూసి మనం కచ్చితంగా నేర్చుకోవాలి. సమాజం గురించి శ్రీశ్రీ మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే నువ్వు నేనే కలిస్తే మనం.. మనం మనం కలిస్తే జనం.. జనం. జనం కలిస్తే ప్రభంజనం. అయితే ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే.. పక్కవాడు కొంచెం బాగుపడినా మనం చూసి ఓర్వలేకపోతున్నాం.  వారికి ఎదురు దెబ్బలు తగిలితే మనం ఆనందిస్తున్నాం.  మనకంటే తక్కువ స్థాయిలో బతకాలని కోరకుంటున్నాం.  విడిపోవడానికి అనేక మార్గాలను వెతక్కొంటున్నాం. అలా కాకుండా కనీసం కుటుంబంతో అయినా కలిసి మెలిసి ఉండేందుకు ప్రయత్నిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: