చాలామందికి అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం. మరికొంతమందికి అరటి పళ్ళు అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ అరటిపండు తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. రోజు ఒక్క అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా? అరటి పండ్లను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఈ పండు ప్రతి సీజన్ లోను దొరుకుతాయి. వీటి ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అరటి పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండ్లను తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. అలసట మటుమాయం అవుతుంది.


ఈ పండు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అందుకే చాలామందికి భోజనం తరువాత అరటిపండును తినే అలవాటు ఉంటుంది. అరటిపండ్లలో ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఆరోగ్యకరమైన పండుగ భావిస్తారు. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు అధిక రక్తపోటు నుంచి మన గుండెను రక్షించడానికి కూడా సహాయపడతాయి. అరటి పండ్లలో బలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అరటి పండ్ల లోని డోపామైన్, కాటెచిన్స్ మన మానసిక స్థితిని మెరుగ్గా సహాయపడతాయి. అరటి పండ్లలో ఉండే సెరోటోనిన్ మానసిక స్థితిని నియంతరించడానికి సహాయపడుతుంది.


అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ రాత్రిళ్లు మనం బాగా నిద్రపోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ అరటి పండులో 320-400 మిల్లీగ్రాముల పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఈ పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తపోటును నియంతరించడానికి సహాయపడుతుంది. అరటి పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం, అధిక పొటాషియం కలిసి హై బీపిని కంట్రోల్ చేస్తుంది. అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ అరటి పండ్లను తినటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: