చాలా మందికి 11 నెలలకే రెంటల్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారనే సందేహం వచ్చుంటుంది. దానికి సంబంధించి అసలు కారణం చాలా మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చట్టం 108 ప్రకారంగా 11 నెలలకే రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లో సెక్షన్ 17 రూల్స్ ప్రకారంగా ఒక సంవత్సరం కంటే తక్కువ లీజు ఒప్పందం చేసుకోవడానికి లేదు.
ఏడాదికి లీజు ఒప్పందం చేసుకుంటే రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాలి. ఇదంతా కాస్త కష్టంతో కూడుకున్న పని. అందుకే 11 నెలలకే రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 11 నెలలు పూర్తి అయితే మరో 11 నెలలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే దీని వెనకున్న రహస్యం. ఇది ఎంతో సులువైన పద్దతి కాబట్టి రెంటల్ అగ్రిమెంట్‌ను 11 నెలల వరకే చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఏ ఇబ్బంది కూడా ఉండదు. పైగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని కూడా అంతగా ఉండదు.