ప్రస్తుతం ప్రజలు చాలా మంది ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ ని కచ్చితంగా ఉపయోగిస్తూ ఉన్నారు.. దీంతో రోజురోజుకీ గ్యాస్ సిలిండర్లలో మోసాలు చేసే సంఖ్య కూడా అలానే పెరుగుతోంది. అయితే మనం కొన్న ఈ గ్యాస్ సిలిండర్ మంట నీలం రంగులో కనిపిస్తుంది.. అయితే ఖాళీగా అవుతున్నప్పుడు  మాత్రం ఈ రంగు పసుపు రంగులోకి మారుతుందని గ్యాస్ అయిపోయే పరిస్థితికి వచ్చిందని చాలామంది గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా కాకుండా ఇంకా సింపుల్గా గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చట.


మనం ఒక తడి గుడ్డను తీసుకొని దాంతో సిలిండర్ ని తుడవాలి.. బాగా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత సిలిండర్ పైన అక్కడక్కడ తడి ఆరిపోతూ ఉంటుంది.. మరి కొన్ని చోట్ల తడి నెమ్మదిగా ఆరిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది.. ఉదాహరణకు సిలిండర్ మొత్తం తుడిచిన తర్వాత సగభాగం తడి త్వరగా మారిపోయి మిగిలిన భాగం నెమ్మదిగా ఆరిపోతూ ఉందంటే. త్వరగా ఎక్కడి వరకు ఆరిపోతే అక్కడ వరకు సిలిండర్ అయిపోయినట్టుగా గుర్తించుకోవాలట.



మరొక పద్ధతి ఏమిటంటే ముందుగా ఒక గుడ్డని నీటిలో బాగా తడిపి ఆ తర్వాత ఆ గుడ్డను సైతం గ్యాస్ సిలిండర్ చుట్టూ చుట్టాలి సిలిండర్ పైన వస్త్రాన్ని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తీసివేసిన తర్వాత వాటిని పరిశీలిస్తే గ్యాస్ సిలిండర్ అయిపోయిన కొంత భాగం వరకు పొడిగా మారుతుంది. ఆ తర్వాత భాగం కాస్త తేమగా కనిపిస్తుందట. ఇలా ఎవరైనా సరే గ్యాస్ ఎంత అయిపోయింది ఎంత ఉంది కొత్త సిలిండర్ వంటి విషయంలో కూడా ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల గ్యాస్ సిలిండర్ ఫుల్లుగా వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: