సుమారు ఓ వ్యక్తి 610 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. "భారీకాయుడు ఖలీద్ బిన్ మొహసేన్ షరీ" కేవలం 6 నెలల్లో ఏకంగా 542 కిలోల బరువు తగ్గి.... అందరిని ఆశ్చర్యపరిచాడు. 610 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గాడు. 2013లో ఖలీద్ బరువు అక్షరాల 610 కేజీలు. ఇతను మూడేళ్ల పాటు దాదాపు మంచానికే పరిమితమయ్యాడు. అధిక బరువు కారణంగా చాలా కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో ప్రాణాపాయం కూడా సంభవించింది. పూర్తిగా అతడు మంచానికే పరిమితమయ్యాడు.

ఖలీద్ సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా సహాయంతో బతికి బయటపడ్డాడు. ఖలీద్ స్టోరీ విని చలించిపోయిన గత సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణలను కాపాడుకునేందుకు ముందుకు వచ్చాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందించేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేశాడు. తన సొంత డబ్బులతో ఖలీద్ కు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ముందుగా ఖలీద్ ను బజాన్ లోని అతని ఇంటి నుంచి ఫోర్క్ లిఫ్ట్ ద్వారా ప్రత్యేకంగా తయారుచేసిన ఓ బెడ్ ని ఉపయోగించి రియాద్ లోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీకి తరలించారు. అక్కడ అధునాతన వైద్య చికిత్సలతో పాటు కఠినమైన డైట్ మెయింటైన్ చేశాడు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతడికి చికిత్స అందించారు.

గ్యాస్ట్రిక్, బైపాస్ సర్జరీలు చేశారు. శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేపించారు. ఫిజియోథెరపీ నిర్వహించారు. దాంతో ఆరు నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. ఇక 2023 నాటికి 542 కేజీల బరువు తగ్గి 63.5 కిలోల బరువుకు చేరాడు. ఖలీద్ శరీరంపై ఆదనపు చర్మం తొలగింపునకు శస్త్ర చికిత్సలు చేశారు. ఒకప్పుడు జీవించి ఉన్న అత్యంత బరువైన వ్యక్తుల్లో రెండో వ్యక్తిగా ఖలీద్ పేరు మార్మోగిపోయింది. కేవలం 6 నెలల్లోనే శరీర బరువును కోల్పోయి సాధారణ వ్యక్తిగా మారాడు. ఇప్పుడు తన పనులు తాను చేసుకుంటున్నాడు. అందరూ "ది స్మైలింగ్ మ్యాన్" అంటూ ఖలీద్ ను పిలవడం ప్రారంభించారు. అద్భుతమైన పరివర్తనతో సరికొత్త రూపు సంతరించుకున్న ఖలీద్ ప్రస్తుతం నాజూకుగా తయారయ్యి వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: