ముఖేష్ అంబానీ ఇంటి నిర్మాణం 2010లో పూర్తి అయ్యింది. ఈ భవనానికి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండేటువంటి పౌరాణిక ద్వీపం యాంటిలియా అనే పేరును కూడా పెట్టారు. దాదాపుగా 27 అంతస్తులతో ఈ ఇంటిని నిర్మించారు. ఎలాంటి భూకంపాలు వచ్చినా కూడా ఈ ఇల్లు తట్టుకొని నిలబడుతుందట. ఇకపోతే అంబానీ ఇంటి నిర్మాణ అంత ఈజీ విషయం కాదు.. అంబానీ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు. వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అంబానీ ఇంట్లో వంట చేయాలి అంటే కచ్చితంగా డిగ్రీ పాసై లేదా డిప్లమా పాస్ అయి ఉండాలట. ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారుగా 600 మంది ఉన్నారట. వంట చేసేవారికి ప్రతినెల జీతం రెండు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. అలాగే వీరికి ఇంటర్వ్యూలు టెస్టులు కూడా ఉంటాయట. వీరికి అంబానీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందంటే చాలు ఇక వారి దశ తిరిగిపోతుంది. ఎవరైనా సరే వారి ఇంట్లో ఉన్నప్పుడు వారికి ఒక ప్రైవేటు రూమ్ కూడా ఇస్తారు.. అలాగే వీరికి వైద్య విద్య భత్యం కూడా భారీ మొత్తంలోనే చదివిస్తారని తెలుస్తోంది. ఇదే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న ఇళ్ళకి పనిచేసే వారికి కూడా లక్షల లోనే జీతాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద ఈ 600 మందికి కొన్ని కోట్ల రూపాయలు అంబానీ చెల్లిస్తున్నారు.