మనదేశంలో మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. కానీ ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి విశ్వాసాలు వారివి. కొన్ని కొన్ని సంప్రదాయాలు చూసేందుకు చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. ప్రజలు మాత్రం వాటిని పాటిస్తూనే ఉంటారు. అయితే ఈ మూఢనమ్మకాలు కేవలం మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నేటికీ ఉన్నాయి.

పురాతన కాలం నుంచి వారి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను ఇప్పటికీ వారి తరాల వారు పాటిస్తూ ఉంటారు. ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా చదువుకోని వారిలో, గ్రామాలలో, ఆదివాసి గిరిజన సమూహాలలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు అలానే కొనసాగుతున్నాయి. అలాంటి ఓ మూఢ నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా ఇనుప "కంచె"కి బ్రాలు వేలాడదీసి కనిపిస్తుంది న్యూజిలాండ్ దేశంలోని కార్ డ్రోనా ప్రాంతం. ఈ కంచెకి చాలా లోదుస్తులు వేలాడుతూ అందరికీ దర్శనమిస్తుంటాయి. దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది. న్యూజిలాండ్ దేశంలోని కార్ డ్రోనా సెంట్రల్ ఒటాగో ఓ అందమైన పర్యాటక ప్రదేశం. చుట్టూ లోయలు, కొండలు, గుట్టలతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ అందమైన ప్రదేశంలో ఓ ఇనుపకంచే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన అమ్మాయిలు తమ ఒంటిపై ఉన్న "బ్రా" ని తొలగించి ఈ కంచెకి తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి మంచి వ్యక్తి భర్తగా వస్తాడని వారి నమ్మకమట. ఈ సాంప్రదాయం మొదట 1999 లోనే వెలుగు చూసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.


మొదట అక్కడ ఎవరు వేలాడదీశారో తమకు తెలియదని.. కానీ ఈ నమ్మకం రాను రాను పెరిగిపోయిందని చెబుతున్నారు. మొదట్లో స్థానికులలో మాత్రమే ఈ సాంప్రదాయం పై నమ్మకం ఉండేది. కానీ పర్యాటక ప్రాంతం కావడంతో విదేశీ పర్యాటకులు కూడా తమ బ్రాలను విప్పి అక్కడి కంచెకు తగిలిస్తున్నారు. ఇలా చేసిన చాలామందికి వారి కోరికలు కూడా నెరవేరాయట. అయితే కొన్ని నెలల క్రితం ఈ కంచెకి వేలాడుతున్న లోదుస్తులు చోరీకి గురయ్యాయి. దీంతో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందడం ప్రారంభించింది. ఈ సాంప్రదాయం కారణంగా ఆ ప్రాంతానికి బ్రా వ్యాలీగా పేరు పడింది. ఈ వింత సాంప్రదాయం ఇప్పుడు వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: