ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన కట్టు బొట్టులతోనే, అందంతో మంచి పాపులారిటీ అందుకుంది. ఇమే జీవనశైలి కూడా చాలా విలాసవంతంగానే ఉంటుంది. ఖరీదైన దుస్తులు ఖరీదైన పరికరాలు ఇలా సుమారుగా ఒక క్వీన్ జీవితాన్ని ఈమె గడుపుతోంది. ముఖేష్ అంబానీ కుటుంబం సాదాసీదా వస్తువుల ధర కూడా లక్షలలో కోట్లలో ఉంటుంది. నీతా అంబానీ ప్రతిరోజు ఉపయోగించే వస్తువులకు కూడా ప్రత్యేకమైన విలువ ఉన్నది. ఉదాహరణకు ఇమే తాగేటువంటి వాటర్ బాటిల్ ధర తెలిస్తే ఆశ్చర్య పోతారు.


సోషల్ మీడియాలో నీతా అంబానీ నీరు తాగుతున్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఇమే వాటర్ బాటిల్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందాన్ని కాపాడుకోవడం కోసమే కాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఖరీదైన నీటిని తాగుతున్నట్లు ప్రచారంలో ఉన్నది.. నీతా అంబానీ తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ద్వారా సుమారుగా 27 వేల రూపాయలకు పైగా ఉంటుందట. ప్రపంచంలోనే చాలా ఖరీదైన వాటర్ బాటిల్ ఇదేనట. ఈ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు చర్మం ఎప్పుడూ కూడా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.


ఈ నీరు ఎక్కడపడితే అక్కడ దొరకదని.. వసంత కాలంలో పీజీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్  వంటి ప్రాంతాలలో సేకరిస్తారట. ఈ నీటిలో ఎక్కువగా ఖనిజలవణాలు కూడా అధిక మోతాదులో ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఒకానొక ఇంటర్వ్యూలో కూడా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈ నీరు తాగడం వల్లే తాను ఇంత హుషారుగా అందంగా కనిపిస్తూ ఉన్నానంటు తెలియజేసింది. కానీ తను తాగుతున్న నీటి ధర పై వస్తున్న వార్తలు నిజం లేదని కూడా తెలిపింది. కానీ 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఒక వాటర్ బాటిల్ తో కనిపించింది. అయితే ఈ వాటర్ బాటిల్ ధర సుమారుగా 49 లక్షలట.. కానీ వీటి మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ వాటర్ బాటిల్ని నిజంగానే బంగారుతో చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: