ఉత్తరకొరియా.. భూమిపైనే ఉన్న మరో ప్రపంచం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటు. ప్రపంచంతో సంబంధం లేని ఈ దేశంలో జీవించడం అంత ఈజీ కాదని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ఉత్తర కొరియా నియంత కిమ్ కి సంబంధించి ఏడాది పొడుగునా ఏదో ఒక సంచలన విషయం బయట పడుతూనే ఉంటుంది. ఈ నియంత గురించి సంచలన విషయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆ దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి.


అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అక్కడి ప్రజలకు వారి అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. అక్కడి ప్రజలు కిమ్ ని దైవంగా భావిస్తారు. కానీ ఇదంతా బయటకు మాత్రమే. అక్కడి ప్రజల మనసులో మాత్రం అతడు లేడు. వారు ఈ విషయాన్ని బయటకు చెప్పలేరు. ఇక కిమ్ భోగాల గురించి చెప్పుకుంటూ పోతే ఈ జీవితమే సరిపోదేమో. అక్కడి ప్రజలకు అతని పెట్టే రూల్స్ ఒక్కోసారి చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. కిమ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు.

అలాంటి వ్యక్తికి భార్యగా వెళ్లాలంటే ఇంకేమైనా ఉందా..! ప్రస్తుతం కిమ్ భార్య రిసోల్ జు లూనార్ పరిస్థితి కూడా అంతే. కిమ్ అక్కడి ప్రజలకే కాదు తన భార్యకు కూడా ఎన్నో రూల్స్ పెట్టారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కిమ్ భార్య మంచి గాయని, చీర్ లీడర్. అయితే ఆమెను కిమ్ తండ్రి, నియంత కిమ్ జంగ్ ఇల్ ఓ కార్యక్రమంలో చూశాడు. ఆ తర్వాత 2008లో గుండె నొప్పితో బాధపడుతున్న ఇల్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కిమ్ ని ఆదేశించాడు. దీంతో ఆమెను కిమ్ 2009 లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడనేది మీడియాల కథనం. అంతేకాదు పెళ్లి తర్వాత కిమ్ తన భార్య పేరును కూడా మార్చేశారట. ఇది మాత్రమే కాదు పెళ్లయిన దగ్గర నుండి ఆమె తన తల్లిదండ్రులను కూడా కలవడానికి కిమ్ ఒప్పుకోలేదు. చివరికి ఆమె కిమ్ సూచించిన దుస్తులే వేసుకోవాలి, అతనికి నచ్చిన హెయిర్ స్టైల్ ఇలా చాలా ఆంక్షలు విధించాడట. ఇక ఆమె ఒంటరిగా బయటకు వెళ్లడానికి వీలు లేదు.


కేవలం భర్తతోనే బయటకు వెళ్లాలి. ఇక వీరికి 2010లో మొదట బిడ్డ జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బిడ్డ జన్మించింది. ఇలా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో కిమ్ సంతోషంగా లేడట. మగ బిడ్డ జన్మించే వరకు పిల్లలను కనాలని ఆమెను ఆదేశించాడట. కొన్నాళ్ల కిందట కిమ్ కి మరో బిడ్డ జన్మించింది. కానీ కూతురు జన్మించిందా..? కొడుకు జన్మించాడా..? అనేది బయటకు ప్రకటించలేదు. కానీ మగ బిడ్డ జన్మించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఇక గతేడాది ఆర్మీ నిర్వహించిన పరేడ్ లో కిమ్ తన భార్య రీ సోల్ జూ, తన కుమార్తె జూ యే తో కలిసి విందుకు హాజరయ్యాడు. ఈ వేడుకల్లో బాంక్వెట్ లో టేబుల్ సెంటర్ సీట్ లో కిమ్ తన కూతురిని కూర్చోబెట్టాడు. దీంతో ఆమె దేశానికి భవిష్యత్తు నాయకురాలు అనే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kim