చాలామంది ప్రజలు చికెన్ తినడానికి మక్కువ చూపుతో ఉంటారు.. మరి కొంతమంది చికెన్ లేనిదే ముద్ద దిగదు అనే అంతలా ప్రవర్తిస్తూ ఉంటారు. చికెన్ కి ఎన్నో రకాల పేర్లతో వీటిని రకరకాలుగా తింటూ ఉంటాము. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేసే గుణాలు ఇందులో ఉన్నాయని వైద్యులు సైతం తెలియజేస్తూ ఉంటారు. కానీ చాలామంది స్కిన్ తీసేసి తింటూ ఉంటారు మరి కొంతమంది స్కిన్ తో కూడా తింటూ ఉంటారు.. మరి చికెన్ ని ఎలా తింటే మంచిది అనే సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది వాటి గురించి చూద్దాం.


సహజంగా నాటు కోళ్లను స్కిన్ తోనే తినడం వల్ల రుచికి రుచి ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే ఫారం కోళ్లను స్కిన్ తీసేసి తింటూ ఉంటారు. అయితే స్కిన్ తీసేసి తినడం మంచిది కాదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. స్కిన్ కూర రుచికి రుచిగా ఉంటుందని ఆరోగ్యం పై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని బాగా చూపుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. కోడి స్కిన్లు హానికరమైన కొవ్వులను సైతం ఎక్కువగా కలిగి ఉంటుందని ఇందులో పెద్దగా పోషక విలువలు కూడా ఉండవని తెలుపుతున్నారు.


చికెన్ స్కిన్ తో తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన కొవ్వులు పెరిగిపోతాయని దీంతో బరువు కూడా పెరిగిపోతారని వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే స్కిన్ తో చికెన్ తినడం వల్ల మధుమేహం గుండె జబ్బులు రక్తపోటు వంటి సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయట. అందుకే స్కిన్ ని అసలు తినవద్దని తెలియజేస్తూ ఉంటారు. పలువురు వైద్యులు పరిశోధనలు చేసిన తర్వాతే చికెన్ స్కిన్ మంచిది కాదని తెలియజేశారట. నాటు కోడిని ఎలా తిన్నా కూడా ఉపయోగకరమే అంటూ తెలియజేస్తున్నారు.. ఒకవేళ ఎవరికైనా స్కిన్ తో సహా తినాలి అంటే.. చికెన్ని వండేటప్పుడు కాస్త ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు విజిల్స్ వచ్చిన తర్వాత వండుకొని తినడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: