ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అది కేవలం వజ్రమే. కానీ చాలా మంది బంగారమే చాలా విలువైనది అని అనుకుంటారు. కానీ బంగారం కంటే... వజ్రాలే చాలా విలువైనవి. వజ్రాలకు ఎక్కడైనా మంచి డిమాండ్‌ ఉంటుంది. అయితే... తాజాగా రెండో అతి పెద్ద వజ్రం తెరపైకి వచ్చింది. బోట్స్ వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలియజేసింది.


దీనిని ఎక్స్-రే టెక్నాలజీ సహాయంతో గుర్తించినట్లు కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. ఇది అత్యధిక నాణ్యత కలిగిన వజ్రంగా గుర్తించారు. దక్షిణాఫ్రికాలో 1905 లో 3,106 క్యారెట్ల కలినన్ వజ్రం దొరికిందని, ఆ తర్వాత దొరికిన అతిపెద్ద వజ్రం ఇదేనని పేర్కొన్నారు. కలినన్ వజ్రాన్ని జెమ్స్ గా ముక్కలు చేశారని వెల్లడైంది.  వీటిలో కొన్ని జెమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉన్నాయని స్పష్టం చేయడం జరిగింది.


వజ్రాలు అధికంగా దొరికే దేశాల్లో బోట్స్ వానా రెండవది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలన్నీ ఇక్కడ దొరికినవి కావడం విశేషం. కరోవే గనిలో 2019లో దొరికిన 1,758 క్యారెట్ల సెవెలో వజ్రం ఇప్పటి వరకు రెండో అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లోకి ఎక్కిందన్న మాట. దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ లూయిస్ వుయిట్టన్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ కల్లినన్ వజ్రాన్ని తొమ్మిది ముక్కలుగా చేశారు.

వీటిలో కొన్ని జేమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపింది. వజ్రాలను ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాల్లో బోట్స్ వానా ఒకటి కావడం విశేషం. మరోవైపు తమ దేశంలో ఇప్పటివరకు దొరికిన వజ్రాల్లో ఇదే అతి పెద్దదని బోట్స్ వానా ప్రభుత్వం ప్రకటించింది. jexe అతిపెద్ద 2492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం చాలా సంతోషంగా ఉందని లూకారా డైమండ్ కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: