అంత భరణమా అయితే మీరే సంపాదించుకోండి

కొన్ని వివాహ బంధాలు ఎక్కువ కాలం నిలబడటం లేదు. కొంతమంది దంపతులు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇందుకు ఎన్నో విషయాలను కారణాలుగా చూపుతున్నారు. అయితే కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో సంపాదన లేని డివోర్స్డ్ ఉమెన్కు మాజీ భర్త మనోవర్తి చెల్లించాల్సి ఉంటుంది.


అయితే దీని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తూ మాజీ భర్తలపై రివెంజ్ తీర్చుకుంటున్నారు. తాజాగా ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


విడాకులు తీసుకున్న ఒక మహిళ, మాజీ భర్త నుంచి తనకు భారీ మొత్తంలో నెలవారీ మెయింటెనెన్స్ ఖర్చులు కావాలని కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. ఆమె కేసు వాదించిన లాయర్ కు, హైకోర్టు జడ్డికి జరిగిన సంభాషన వైరల్ గా మారింది. తన క్లయింట్ కు మాజీ భర్త నుంచి రావాల్సిన భరణాన్ని రూ.6,16,300కు పెంచాలని లాయర్ డిమాండ్ చేశారు.


తన క్లయింట్ షూస్, డ్రెస్సులు, బ్యాంగిల్స్ వంటి వాటి కోసం నెలకు రూ.15 వేలు, ఇంటి ఖర్చులు, తిండికి నెలకు రూ.60 వేలు అవసరం అని లాయర్ కోర్టుకు తెలిపారు. ఫిజియోథెరపీ, మోకాలి నొప్పులు, ఇతర మందులు కోసం రూ.4-5 లక్షలు అవసరం అని చెప్పారు. అయితే ఈ వాదనలపై హైకోర్టు మహిళా జడ్డి ఆశ్చర్యం వ్యక్తం  చేశారు. ఇది కోర్టు ప్రాసెస్ లను దోపిడీ చేయడమేనని అభిప్రాయపడ్డారు.


దయచేసి ఒక వ్యక్తికి కావాల్సిందల్లా కోర్టుకి చెప్పకండి. నెలకు  రూ.616300 కావాలా? ఒంటి మహిళా ఎవరైనా అంత డబ్బులు ఖర్చు చేస్తారా? ఆమె ఇంత భారీగా ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోనివ్వండి. భర్త మీద ఆధారపడి కాదు. మీకు కుటుంబ బాధ్యతలు ఏమీ లేవు. మీరు పిల్లలను చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ కోసమే ఇంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మీరు రీజన్బుల్ గా ఉండాలి అని లేకుంటే పిటిషన్ కొట్టివేస్తామని సదరు మహిళను ఉద్దేశించి జడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పలువురు హ్యాట్సప్ జడ్జ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: