కార్ల పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంటున్నదా? దేశంలో అమ్ముడుపోకుండా డీలర్ల వద్దే లక్షల సంఖ్యలో కార్లు పడి ఉండటం గమనిస్తే అవుననే అంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు.


కార్లు, ఎస్ యూవీల అమ్మకాలు గణనీయంగా మందగించాయి.  దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద అమ్ముడుపోకుండా పడి ఉన్న కార్ల విలువ ప్రస్తుతం రూ.73 వేల కోట్ల విలువైన 7 లక్షలకు పైగా అమ్ముడుపోని కార్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది.


జులై ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న వాహనాల నిల్వ వ్యవధి ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగిందని చెప్పింది. అమ్మకాలు తగ్గడమే దీనికి కారణమని ఆటోమొబైల్స్ అసోసియేషన్ అధ్యకుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. ఇది డీలర్ స్థిరత్వానికి ప్రమాదాన్ని కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 


అమ్మకానికి కార్లు ఉన్నా.. ఆకర్షణీయ డిస్కౌంట్లు ఇస్తున్నా 62 రోజుల నుంచి 67 రోజుల ఆల్ టైం హై ఇన్వెంటరీని ప్యాసింజర్ వెహికల్స్ ఎదుర్కొంటున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత అమ్మకాలు పుంజుకుంటాయని తొలుత భావించారు. దానికి ఆశాజనక రుతుపవన సీజన్ కూడా తోడైంది. అయినా కూడా వారాల తరబడి వాహనాలు డీలర్లే వద్దే ఉంటున్నాయి. వర్షాకాలంలో వాహనాలు అమ్మకాల తగ్గడం కూడా కార్లు పోగు పడటానికి కారణంగా అంచనా వేస్తున్నారు.


అమ్ముడుపోని కార్లు ఏడు లక్షల వరకు ఉంటాయని మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. ఒక్కోటి సగటున 9.5 లక్షల రూపాయలు అనుకున్నా గత రెండు నెలల్లో రూ.77 వేల కోట్ల విలువైన కార్లు పేరుకుపోయాయని తెలిపారు. జూన్ నెలలో మొత్తం హోల్ సేట్ డిస్సాచెస్ 341000 యూనిట్లు ఉన్నాయి. అంటే నాలుగు శాతం ఎక్కువ. కానీ.. వాస్తవంగా అమ్మకాలు(వాహన రిజిస్ర్టేషన్లు) 281600 యూనిట్లే. ఉత్పత్తికి మార్కెట్ డిమాండ్ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేవని.. మంచి సిబిల్ స్కోర్ ఉంటేనే రుణాలు మంజూరు చేస్తున్నాయని.. అందువల్లే డిమాండ్ ఉండటం లేదని ముంబయికి చెందిన ఓ డీలర్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: