కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యాలెండర్లకు క్యాలెండర్లు మారిపోతున్నా.. రాహుల్ గాంధీ పెళ్లి స్టేటస్ లో మాత్రం ఎలాంటి రాని విషయం తెలిసిందే. ఆయన ఎక్కడకు వెళ్లినా.. అక్కడి వారు అడిగే ప్రశ్నల్లో ఆయన పెళ్లి గురించి ఒక ప్రశ్న పక్కాగా ఉంటుంది.


ఇలా అలవాటైన తీరుకు భిన్నంగా రాహుల్ గాంధీ వ్యహరించారు. తాజాగా కశ్మీర్ కాలేజ్ అమ్మాయిలతో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఎప్పుడూ తాను ఎదుర్కొనే పెళ్లి ముచ్చటను ఆయనే ప్రస్తావించడం విశేషం.   కశ్మీర్ కాలేజీ అమ్మాయిలతో మాట్లాడిన రాహుల్ వారిని ఉద్దేశించి.. పెళ్లి చేసుకోవడంపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుందా అని ప్రశ్నించారు.



దీనికి రియాక్ట్ అయిన కశ్మీరీ యువతులు రాహుల్ పెళ్లి ముచ్చటను ప్రస్తావించారు. ఇంతకూ మీ పెళ్లి ఎప్పుడూ అంటూ ఆయన్ను ప్రశ్నించారు. 



బదులుగా మాట్లాడుతూ… తాను ఇరవై  ముప్పై ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమించినట్లు పేర్కొన్నారు. అయితే  ఈ సమాధానాన్ని నవ్వుతూ ఇవ్వడం గమనార్హం. పెళ్లికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పారు. అలా అని పెళ్లిని తోసిపుచ్చడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కశ్మీరీ అమ్మాయిలు రాహుల్ ని ఒక కోరిక కోరారు.


వివాహానికి తమను పిలుస్తారా అని ప్రశ్నించగా.. తప్పకుండా అంటూ రాహుల్ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన పోస్టు చేశారు. కొద్ది నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్ బరేలీ వెళ్లగా.. అక్కడి వారు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పెళ్లి త్వరగా చేసుకోవాలన్న మాట రావడంతో ఈ అంశం పెను ప్రాధాన్యం సంతరించుకొంది. మొత్తానికి రొటీన్ కు భిన్నంగా తానే పెళ్లి గురించి మాట ఎత్తడం విశేషంగా చెప్పొచ్చు. మరి రాహుల్ పెళ్లి శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: