ప్రస్తుతం ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే డోర్‌ ముందుకు పార్శిల్ వచ్చి ప్రత్యక్షం అవుతోంది. ఈ విధంగా యాప్ లో ఆర్డర్ పెట్టడం ఆలస్యం.. వీలైనంత వేగంగా ఫుడ్ డెలీవరీ చేసే యాప్ ల్లో స్విగ్గీ ఒకటనే విషయం అందరికీ తెలిసిందే.


 ఇదిలా ఉండగా స్విగ్గీ ప్రారంభం అయి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా స్విగ్గీ సీఈవో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవును.. 2014లో బెంగళూరు కేంద్రంగా స్విగ్గీ ప్రారభం అయింది. శ్రీ హర్ష మాజేటి, రాహుల్, నందన్ రెడ్డి భాగస్వామ్యంలో ఈ ఫుడ్ డెలీవరీ వ్యవస్థ ఏర్పాటు అయింది. ఈ క్రమంలో సుమారు 600 భారత నగరాల్లో స్విగ్రగీ కార్యకలాపాలు విస్తరించాయి. ఈ  సమయంలో తొలిరోజు వ్యాపారం ప్రారంభించిన జ్ఞాపకాలను శ్రీ హర్ష పంచుకున్నారు.


స్విగ్గీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పందించిన ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రీ హర్ష సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తొలి రోజు వ్యాపార అనుభవాన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 2014 ఆగస్టు 6న స్విగ్గీని ప్రారంభించినట్లు వివరించారు.


 ఈ సమయంలో ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూసినట్లు తెలిపిన ఆయన.. మొదటి రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని మరుసటి రోజు ఆర్డర్ ను అందుకున్నట్లు చెప్పారు. అదే తమ జర్నీకి అసలైన ప్రారంభం అని వెల్లడించారు. తమ తొలి పార్టర్న్ లో ఒకరైన ట్రపుల్స్ రెస్టారెంట్ నుంచి ఆ రోజు రెండు ఆర్డర్స్ వచ్చాయని పేర్కొన్నారు.


నాటి నుంచి వారితో తమ భాగస్వామ్యం అలానే కొనసాగిందని, అది మరింత బలపడిందని తెలిపారు. ఒక దశలో ఒక్క రోజుల్లోనే 7261 ఆర్డర్లు అందుకున్నట్లు శ్రీ హర్ష చెప్పారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మూడు లక్షల రెస్టారెంట్లతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. తమపై విశ్వాసం ఉంచిన రెస్టారెంట్లకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: