* ఖైరతాబాద్ విగ్రహంకు 70 ఏళ్ల చరిత్ర
* 1954 నుంచి ఒక్క అడుగుతో ప్రారంభం
* సింగిరి  శంకరయ్య కారణంగా గణపతి ప్రతిష్టాపన
* సప్తముఖ గణేషుడి రూపంలో ఈ సారి దర్శనం


వినాయక చవితి రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ విగ్రహం మాత్రమే. ఎందుకంటే ఆకారం అలాగే పరిమాణంలో...  ఖైరతాబాద్ గణపతిని మించిన గణపతి ఎక్కడ ఉండదు. 70 సంవత్సరాలుగా ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని... ఖైరతాబాద్ ప్రాంతంలోనే ప్రతిష్టిస్తున్నారు భక్తులు. ఒక్క అడుగుతో మొదలైన ఈ.. ఖైరతాబాద్ మహా గణపతి... 70 అడుగుల వరకు చేరింది. ఈ సంవత్సరం 70 వసంతాలు పూర్తి చేసుకోనుంది ఖైరతాబాద్ విగ్రహం.


ఇలాంటి నేపథ్యంలోనే ఈ ఏడాది 70 అడుగుల ఎత్తుతో.. సప్తముఖ గణేషుడి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు గణనాథుడు. ముఖ్యంగా ఈ మహాగణపతిని భక్తులు ప్రతిసారి మట్టితోనే నిర్మించడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ విగ్రహం కోసం కోటి రూపాయల వరకు... ఖర్చు చేస్తున్నారు. ఈ ఖైరతాబాద్ గణేశుడు ఇరువైపులా... శివపార్వతులు అలాగే శ్రీనివాస కళ్యాణం మండపం కూడా ఉంటుంది.


ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఏడు దశాబ్దాలు చరిత్ర ఉందని ఇప్పటికి చెబుతూ ఉంటారు. వాస్తవంగా 1954 సంవత్సరంలో సింగిరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు... ఒక్క అడుగు ఉన్న మహాగణపతిని... ప్రతిష్టించి పూజలు చేసుకున్నాడు. అలా సింగిరి  శంకరయ్య...  1954లో పెట్టిన ఒక్క అడుగు గణపతి కాస్త... ఇప్పుడు 70 అడుగులకు చేరుకోనుంది. 2019 సంవత్సరానికి... ఈ మహాగణపతి 61 అడుగులు చేరుకుంది  


దీంతో ఇండియాలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా కూడా చరిత్ర సృష్టించింది ఖైరతాబాద్ విగ్రహం. అయితే అప్పటి నుంచి ఈ విగ్రహం ఎత్తును తగ్గించడం మొదలుపెట్టారు భక్తులు. అలా 2023 వరకు 63 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాదికి 70 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో...  70 అడుగుల్లోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భక్తులు. ఇక వినాయక చవితి నుంచి మీ మధ్యనం వరకు అంటే తొమ్మిది రోజులపాటు... ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు లక్షల్లో జనాలు వస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: