మిరపకాయలు విటమిన్ B5 ఉండటం వల్ల కొవ్వు ఆమ్లాల విచ్చన్నం సులభం అవుతుంది. ఇక పచ్చిమిరపకాయల్లో కెలరీలు కూడా ఉండవు. విటమిన్ ఏ లోపం రాత్రి కండ్లు కనిపించక పోవడానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మరింత తీవ్రమైన పరిస్థితుల్లో ఇది కోలుకోలేని అంధత్వానికి కారణం కావచ్చు. పచ్చిమిరపకాయలు విటమిన్ ఎను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇది కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.
పచ్చిమిరపకాయల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి చర్యాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన కోల్లాజెన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఫైటోన్యూట్రియెంట్స్ ముడతలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లకు సమర్థవంతంగా చికిత్స చేస్తాయి. ఇక విటమిన్ ఈ చర్మానికి మేలు చేసే సహజమైన నూనెలను సృష్టిస్తుంది. భోజనంతో పాటు పచ్చిమిర్చి తీసుకోవడం సంతోషాన్ని ఇస్తుందని...ఆందోళనను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. వీటిలో ఉండే క్యాప్సెసిన్ యాంటీ డిపెపెంట్ గా వర్క్ చేస్తుంది. ఆనందకరమైన మానసిక స్థితి కొనసాగించేందుకు కారణం అవుతుంది. పచ్చిమిరపకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు ఆస్తమా, దగ్గు, జలుబు వంటి ఊపిరితిత్తుల వ్యాధులను నివారించటంలో సహాయపడతాయి, అలాగే శ్వాసకోశాన్ని శాంతపరుస్తాయి.