ఒక నెలపాటు గనుక ఇది కొనసాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఆ రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే చక్కటి పోషకాలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ తప్పక తినాలి. కానీ బరువు తగ్గాలనో, ఇంకేదో కారణాలవల్లనో దీర్ఘకాలంపాటు మానేస్తే గనుక జీర్ణ క్రియలో ప్రతికూల మార్పులకు దారి తీయవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెదడు సామర్ధ్యం పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఉదయం తినటం అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుందని పలు అధ్యయనాల్లో తెలింది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ మానేయటం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా పెరగవచ్చు. న్యూట్రిషన్ జర్నన్ స్టడి ప్రకారం..
దీర్ఘకాలంపాటు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండే వారిలో భోజనం తరువాత రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడంలో బ్రేక్ ఫాస్ట్ ఇంధనంలా పనిచేస్తుంది.కాబట్టి దానిని స్కిప్ చేస్తే నష్టపోతారు. ఉదయం పూట తినకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. కొంచె నడిచిన, చిన్న పని చేసిన అలసిపోతారు. ఏకాగ్రత దెబ్బ తింటుంది. హార్మోన్లు అసమతుల్యతకు దారి తీయటం ద్వారా ఇతర సమస్యలకు దారి తీయవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎదిగే పిల్లలు, టీనేజర్లు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే చాలా నష్టం. ఎందుకంటే ఉదయం పూట శరీరానికి తగిన పోషకాలు అందకపోతే అది మెదడు సమర్థ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది.