అందుకే గురక అనేది సాధారణ వ్యాధి కాదు అని అది తీవ్రమైన ఇబ్బందులకు ఆహ్వానం పలుకుతుందని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. కొంతమంది ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే గురక పెట్టే వారికి అబ్బ్బ్రక్టివ్ స్లిప్ అప్నియా అనే వ్యాధి ఉంటుందని చెబుతున్నారు. ఈ గురక మెడ పోట్టిగా ఉండటం, స్థూలకాయం, టాన్సిల్స్ పెద్దవిగా ఉండటంతో పాటు అనేక ఇతర కారణాల వల్ల వస్తుయంటున్నారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు కండరాలు రిలాక్స్ అయ్యి ఊపిరితిత్తుల లోకి గాలి వెళ్లినప్పుడు గాలి ప్రవాహం తగ్గుతుందంటున్నారు.
అలాంటి వారు డిప్ స్లిప్ లో ఉన్నప్పుడు గురక వస్తుంది. అంతేకాదు రాత్రిపూట తరచుగా నోరు పొడిబారి పోతూ ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే మెదడు,గుండె మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఆక్సిజన్ అత్యవసరంతక్కువగా చేరటం వల్ల కొంతమంది వ్యక్తులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గురక సమస్య సూలకాయుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయులలో 70 నుంచి 80 శాతం మంది కొరక పెడుతుంటారని చెబుతున్నారు. పెద్ద పోట్ట, లావు మెడ, గొంతు లోపల కొవ్వు పెరిగిపోయిన వ్యక్తులు గురకకు గురవుతారు. అంతేకాదు ముక్కు ఎముక వంకరగా లేదా జలుబు కారణం గా కూడా శ్వాసలో అవరోధం, గురక వస్తుందంటున్నారు నిపుణులు.