అందుకే..కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇందుకోసం మన రోజు వారి భాగంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలని వాయిద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా..ఆహారంతో పాటు..కొన్ని విషయాలను రెగ్యులర్ గా పాటించాలి అని అంటున్నారు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఎలాంటి విషయాలు అలవాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రెండు కిడ్నీలలో ఏదైనా ఒకటి పని చేయకపోవడం వల్ల శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ హెచ్చరిక సంకేతాలను ఎలా గుర్తించాలో ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ ఫాల్ బరువు పెరగటం అనేది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.
ఎందుకంటే ఇది మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుకు కారణంమవుతుంది. దానివల్ల కిడ్నీలు కూడా చాలా దెబ్బతింటాయి. మీరు రోజు నిద్ర పోవడం-లేవటం అనే సమయాన్ని ఒకేలా ఉండేలా సరి చేసుకోండి..దాన్ని ఎక్కువగా మార్చవద్దు. అలాగే ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. దీనివల్ల మూత్రపిండాల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. అలాగే రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీరు తాగటం చాలా ముఖ్యం..సరిపడా నీళ్లు తాగటం వల్ల హైడ్రేషన్ గా ఉండటంతో పాటు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. మీరు రోజుకు అరగంట పాటు వ్యాయామం లేదా మరేదైనా శరీరక శ్రమ చేస్తే, మీ రక్తపోటు బాగా నియంత్రణలో ఉంటుంది. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.