మన సమాజంలో పెళ్లి అంటేనే భయపడని ఆడపిల్లలు అసలు ఉండరు. పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఘట్టం. అయితే తమ జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు లేక చుట్టుపక్కల వారి జీవితాల వల్ల నేర్చుకున్న పాఠాలో తెలియదు కానీ.. ప్రస్తుతం యువత పెళ్లి అనే ఆలోచనకు దూరంగా ఉంటోంది.


మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాలంతో పాటు పరిస్థితులు మనిషి ఆలోచనలు కూడా మారుతూ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు బ్యాచిలర్ గా ఉన్న అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా మోర్గానిక్ స్టార్టీ సంస్థ నిర్వహించిన అధ్యయనంలోను ఇదే విషయం వెల్లడైంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో సింగిల్ గా ఉండటానికి ఇష్టపడే ఆడవారి సంఖ్య 45 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.


అంటే ప్రపంచ వ్యాప్తంగా పుట్టే పిల్లల సంఖ్యపై కూడా దీని ప్రభావం ఉండబోతుందన్నమాట. ఈ ట్రెండ్ కేవలం ఒక దేశానికి పరిమితం కావడం లేదు. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలు అప్పటి వరకు అనుభవించిన స్వతంత్రంపై  నియంత్రణ తగ్గుతోంది. పిల్లలు, ఇంటి బాధ్యతలతో కెరీర్ పై పూర్తిగా కాన్సట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇండిపెండెంట్ గా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్న నేటి తరానికి పాతకాలం పరమితులు సెట్ కావడం లేదు.


అసలు అడ్జెస్ట్ మెంట్ అంటే ఏంటో తెలియకుండా పెంచడం వల్లే ఈ సమస్యలు ఉత్నన్నమవుతున్నాయి. పెళ్లి చేసుకొని వారి సంగతి పక్కన పెడితే.. పెళ్లి చేసుకున్న వారు కూడా డైవర్స్ కి ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. కాస్త ఆలోచనలు భిన్నంగా ఉంటే చాలు.. మేమేందుకు అడ్జెస్ట్ కావాలి అంటూ విడిపోతున్నారు. దీంతో సమాజంలో ఒంటరిగా మిగిలిపోయిన మహిళల సంఖ్య అధికం అవుతుంది. పెళ్లి, పిల్లలు లాంటివి అవసరం లేకుండా దత్తత తీసుకుంటే సరిపోతుంది అనే వైఖరి కూడా ప్రస్తుతం యువతలో కనిపిస్తోంది. చూడటానికి ట్రెండీగా ఉన్నా ఈ ఆలోచన సమాజంలో బలంగా పాతుకుపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: