పక్షులు ఎక్కువగా కొమ్మల మీద నిద్రపోతూ ఉంటాయి. వాటికి పడిపోతాయి అన్న భయం అనేదే ఉండదు. నిజానికి మనం గాఢమైన నిద్రలోకి జారుకుంటే బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు కదిపి లేపినా త్వరగా మేల్కొని పరిస్థితి ఉంటుంది. మరికొందరైతే నిద్రలో పలువరించడం, బెడ్ మీద పడుకున్నప్పుడు దగ్గున ఉలిక్కి పడటం, కింద జారిపడటం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొంటుంటారు. అంటే నిద్రాణ స్థితిలో స్పృహ లేకపోవటమే ఇందుకు కారణం. మనుషులందరిలో ఉండే సహజమైన ప్రక్రియ ఇది. కానీ పక్షుల్లో మాత్రం అలా ఉండడంటున్నారు నిపుణులు. అవి చెట్ల కొమ్మలపై నిల్చోని నిద్రపోతున్నప్పటికీ కిందకు జారిపడవు. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిలో పక్షులు కూడా ఉన్నాయి. వాటి జీవనశైలి గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత మనలో సహజంగానే ఉంటుంది. గాలిలో ఎగురుతూ , చెట్లపై వాలుతూ ఉండే దృశ్యాన్ని చూసినప్పుడు, వాటి కిల కిల రావాలను విన్నప్పుడు కలిగే ఆనందమే వేరు.కొమ్మలు, రెమ్మల మధ్యన గూళ్లను నిర్వహించుకుని జీవించే పక్షులు ఆహార సేకరణ కోసం ఎక్కడికి వెళ్లినా..సాయంకాలానికి తిరిగి వస్తుంటాయి. వర్షం పడ్డప్పుడు గూటిలో తలదాచుకునే చాలా పక్షులు మిగతా సమయాల్లో గూటి బయట చెట్ల కొమ్మలపై కూర్చునే నిద్రపోతుంటాయని జంతువు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 అయితే రాత్రళ్లు పక్షులు నిద్రపోతున్నప్పుడు కునుకు తీస్తాయి కదా అలాంటప్పుడు కింద ఎందుకు పడవు? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిపుణుల ప్రకారం... సమాధానం ఏంటంటే...పక్షులు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ, ఒక కన్ను తెరిచి నిద్రపోతమని, ఈ సమయంలో వాటి మెదడులోని ఒక భాగం యాక్టివ్ గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఓ వైపు నిద్రపోవడం, ఇంకోవైపు తెరిచి ఉన్న కంటి భాగం, మెదడులోని ఒక భాగానికి మధ్య ఉండే కనెక్షన్ తో స్పృహా తో కూడిన సమాచారం ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీంతో పక్షులు నిద్రలో కింద పడకుండా జాగ్రత్త పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: