నజబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకింగ్ రాజేష్ మంచి కామెడీ చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇక రాకింగ్ రాజేష్ కి కునేళ్ళ క్రితమే వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరికీ గుర్తుగా ఒక బిడ్డ కి జన్మను ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఇక రీసెంట్గా ఆమె భార్యకు శ్రీమంతం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె భార్య శ్రీమంతం ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన పలువురు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. జబర్దస్త్ షో ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

 అలా ఫేమస్ అయినా వారిలో రాకింగ్ రాజేష్ ఒకరు. సుజాత కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరిర్ మొదలుపెట్టిన రాకింగ్ రాజేష్.... ఆ తరువాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా ఎదిగి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు చేస్తున్నాడు. సినిమాలో చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక టీవీ యాంకర్ గా పనిచేసే సుజాత బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక జబర్దస్త్ షో తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అలా జబర్దస్త్ లో పరిచయమైన రాకింగ్ రాజేష్ - సుజాత కొన్నాళ్ళు ప్రేమించుకుని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు ఈ జబర్దస్త్ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదిలా ఉంటే...తాజాగా రాకింగ్ రాజేష్ తన భార్య శ్రీమంతం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో సుజాత ఎంతో చూడముచ్చటగా ఉంది. అంతేకాకుండా "ఈ సమయంలో తన ఆనందాన్ని చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు... నీ మీద నా ప్రేమకు అవధులు లేవు" అనే క్యాప్షన్ ను కూడా జోడించాడు. కాగా ఈ శ్రీమంతం ఫంక్షన్ కు చాలామంది నటీనటులతో పాటు దగ్గరి బంధువులు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ తింటా వైరల్ అవుతున్నాయి. అది చూసినా నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: