వినాయక చవితికి వినాయకుడిని పెట్టి ఊరేగిస్తూ ఉంటారు. ఇక వినాయకుడిని నిమగ్నం చేసి రకరకాల పోస్టులను పెడుతూ ఉంటారు. కానీ నిమగ్నం చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి రోజు నుంచి గణనాథుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన ఓ రేంజ్ లో నిర్వహించుతున్నారు. అంతే కాదు ఎక్కడ చూసినా అందంగా అలంకరించిన వినాయక మండపాలు, పాటలతో వీధి వీధిలో సందడి నెలకొంది. ఇక వినాయకుడి నిమజ్జనాలు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రాంతాలను బట్టి వినాయక నిమజ్జనం చవితి తరువాత మూడో రోజు లేదా 5 రోజు నిర్వహిస్తుంటారు.

కొన్ని ప్రాంతాల్లో తొమ్మిదో రోజు లేదా పదో రోజు కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు నిమజ్జనం చేసిన పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇన్ని రోజులు ఘనంగా పూజలు అందుకున్న ఘనపయ్య గంగమ్మ ఒడిలో చేరుతున్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు అంగరంగా వైభవంగా, ఉత్సాహంగా డాన్స్ చేస్తూ మనసారా వీడ్కోలు చెబుతారు. గణేష్ నిమగ్నం సమయంలో భక్తులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. అవి ఏమిటంటే..వినాయక నిమజ్జనం కోసం సమీపంలో ఉండే నీటి సదుపాయాలు ముందుగా గుర్తించాలి.

ఈ క్రమంలో నిమజ్జనానికి ఎంపిక చేసుకున్న నది, లేదా కుంట, చెరువు వంటివి సురక్షితమా కాదా అనేది నిర్ణయించుకోవాలి. అవి భక్తులకు అందుబాటులో ఉండాలి. కావున వినాయకుడి విగ్రహాలు కలుషితమైన నీటిలో నిమజ్జనం చేయకూడదు. వినాయక నిమజ్జనానికి సమయం కూడా చాలా ముఖ్యం అంటున్నారు. శుభప్రదమైన సమయంలో నిమర్జనం చేయాలి. చంద్ర చక్రం, జ్యోతిష్య ప్రభావాలను పరిగనలోకి తీసుకుని అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. అయితే సాధారణంగా వినాయక నిమజ్జనానికి ఉదయం లేదా సాయంత్రం సమయం అనుకూలమైనదిగా పరిగణిస్తారు. సూర్యస్తమయ లోపు నిమగ్నాన్ని పూర్తి చేయటం మంచిది. ఎందుకంటే చీకటి పడే కొద్ది ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చు. నిమజ్జనానికి ముందు గణేశుడి విగ్రహాలకు పూజ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: