నేటి రోజుల్లో ప్రతిరంగంలోనూ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రతి పనిని కూడా సులభతరం చేసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే చెమట చుక్క చిందించకుండానే అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అందరికీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవనశైలిలో మార్పు మరింత ఎక్కువైపోయింది.


 ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే ఇక బయటకు ఎక్కడికో షాప్ కి వెళ్లి తీసుకునేవారు. కానీ ఇప్పుడు కావాల్సిన వస్తువులు అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ ఇచ్చి ఆర్డర్ పెట్టి ఉన్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నారు. అదే సమయంలో ప్రపంచ నలుమూలల్లో జరిగిన ఎన్నో విషయాలను కూడా స్మార్ట్ ఫోన్ లోనే చూసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక తమకు కావలసిన సమాచారాన్ని కూడా ఇంటర్నెట్లో వెతికేస్తూ ఉన్నారు. అయితే మన దేశంలో అందరూ ఎక్కువగా వాడే సెర్చ్ ఇంజన్ ఏది అంటే అది గూగుల్ అని చెప్పాలి. ఏం కావాలన్నా గూగుల్ తల్లిని అడిగేస్తూ ఉంటారు ఇంటర్నెట్ జనాలు.


 ఈ క్రమం లోనే దేశం లో ఆగస్టు 2024లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్సైట్లు ఏంటి అన్నది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి పోయింది. ఇక ఇటీవల ఈ వెబ్సైట్ల జాబితాను సెమిలర్ వెబ్ విడుదల చేసింది. తొలి స్థానంలో గూగుల్ ఉండగా రెండో స్థానం లో యూట్యూబ్ నిలిచింది. ఆ తర్వాత ప్లేస్ లో ఎక్స్ హాంస్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ ఉన్నాయి. ఇక గ్లోబల్ వైడ్ గా 83.5 బిలియన్ విజిట్స్ తో గూగుల్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ డాట్ కామ్, వాట్సప్ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: