నేటి ఆధునిక సమాజంలో ఒకప్పటితో పోల్చి చూస్తే మూఢనమ్మకాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఒకప్పటిలా మంత్రాలుకు చింతకాయలు రాలుతాయి అనే విషయాన్ని గుడ్డిగా నమ్మడం లేదు జనాలు. కానీ ఇప్పటికీ కొంతమంది ఇక ఇలాంటివి నమ్మి చివరికి మోసపోతూ ఉండడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే నేటి ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలు అన్నిటిని వదిలేసినప్పటికీ కొన్ని రకాల పట్టింపులను మాత్రం ఇప్పటికీ మనుషులు పాటిస్తూనే ఉంటారు అని చెప్పాలి.


 అలాంటి వాటిలో ఉప్పుని వదిలేసి వెళ్లడం లాంటిది కూడా ఒకటి. సాధారణంగా ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఇక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాస్త డల్ అయిపోతే చాలు.. ఉప్పుతోనే పెద్దవాళ్లు దిష్టి తీయడం చేస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే.  ఇలా చేయడం ద్వారా ఇక మనిషిపై ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం ఉప్పు లాగేసుకుంటుందని తద్వారా దిష్టి పూర్తిగా తగ్గిపోతుంది అని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఒకవేళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పును అక్కడే వదిలేయడం కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చాలామంది ఇలాంటిది చేయడం చూస్తూ ఉంటాం.


 ఇలా చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఇలా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పును వదిలేయడం మంచిదా కాదా అనే విషయంపై పండితులు ఏమంటున్నారంటే.. అలా చేయడం ఏమాత్రం సరికాదు అంటూ చెబుతున్నారు. ఎందుకంటే ఉండడానికి నీడనిచ్చిన వారి ఇంట్లో ఉప్పు వదిలేసి వారికి హాని చేయాలి అని ఆలోచన మంచిది కాదు అంటూ చెబుతున్నారు. కావాలంటే ఉప్పును నీళ్లలో వేయాలని అది కరిగిపోయిన తర్వాత ఎక్కడైనా దూరంగా పారబోయాలని సూచిస్తున్నారు. ఇలా చేసినా కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది అంటూ పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: