తెలంగాణ ప్రజలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో ఇది ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ సాధారణ సరస్సు అయి ఉంటే ఇంతలా గుర్తింపు వచ్చి ఉండేది కాదేమో. కానీ ఇది మానవ నిర్మిత కృతిమ సరస్సు కావడం గమనార్హం. దీంతో కేవలం మనదేశంలో మాత్రమే కాదు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా గుర్తింపును సంపాదించుకుంది. అందుకే ఇది పర్యాటక ప్రాంతంగా కూడా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ ప్రజలందరూ హుస్సేన్ సాగర్ ని ట్యాంక్బండ్ అని కూడా పిలుచుకోవడం చేస్తూ ఉంటారు.


 ఇక ప్రతిరోజు ఎంతోమంది పర్యటకులు హుస్సేన్ సాగర్ ను వీక్షించేందుకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సాగర్ మధ్యలో పెద్ద బుద్ధుడు విగ్రహం దర్శనమిస్తోంది. అంతేకాదు సాగర్లో బోటు ప్రయాణం చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు హుస్సేన్ సాగర్ వద్ద హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న భారీ గణేష్ విగ్రహాలు అన్నింటినీ కూడా ఈ హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఈ హుస్సేన్ సాగర్ కి ఆ పేరు ఎలా వచ్చింది అనేది హాట్ టాపిక్ గా మారింది.


 1952లో సుల్తాన్ కులి కుతుబ్ షా ఈ కృత్తిమ సరస్సును నిర్మించారట. అయితే ఈ సరస్సు నిర్మాణ పనులు అన్నింటినీ కూడా కూలి కుతుబ్షా అల్లుడు హుస్సేన్ షా వలి దగ్గరుండి పర్యవేక్షించారట. దీంతో ఇక ఈ సరస్సు తవ్వడం కోసం పనిచేయడానికి వచ్చిన ప్రజలందరూ కూడా దీనిని హుస్సేన్ చెరువుగా పిలుచుకోవడం మొదలుపెట్టారట. చివరికి దీనికి అదే పేరు స్థిరపడిపోయింది. అయితే ఆ తర్వాత తన పేరు మీద కూడా ఒక చెరువు ఉండాలని భావించిన ఇబ్రహీం.. ఇబ్రహీంపట్నం చెరువును తవ్వించాడు అంటూ కథనాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: