క్రమంగా రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల గుండె రక్తాన్ని గట్టిగా పంప్ చేస్తుంది.కాలక్రమేణా రక్తపోటు పెరుగుతుంది. మీతి మీరేనా కాఫీన్ వినియోగం సమస్యాత్మకంగా మారుతుంది. ఇది గుండెను ఉత్తేజపరచడం... రక్తనాళాలు సంకోచించడం ద్వారా రక్తపోటులో తత్కాలిక పెరుగుదల కనిపిస్తుంది. ప్రా సెస్ చేసిన ఫుడ్, షుగర్, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది. బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి. ఆహారంలో అధిక ఉప్పు శరీరం నీటిని నిలుపుకునేందుకు కారణం అవుతుంది. బాడికి రక్త పరిణామాన్ని పెంచుతుంది.
ఇది రక్తపోటు పెరుగుదలకు కారణం. కాగా ఉప్పు తగ్గించటం ద్వారా బీపీని కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు నిపుణులు. అధిక ఆల్కహాల్ తీసుకోవటం అడ్రినలిన పరిమాణం పెరుగుదల... హై బీపీ కి కారణం అవుతుంది. రక్తనాళాలు కుచించుకుపోతాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకోవటం మానుకోమని సూచిస్తున్నారు. రెగ్యులర్ స్మోకింగ్ రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది. రక్తపోటుకు దారితీస్తుంది. సిగరెట్ లోని రసాయనాలు ధమనుల దృఢత్వం, అధిక రక్తపోటు ప్రమాదానికి కూడా కారణం అవుతుంది. ఎక్సర్ సైజ్ లేకుండా నిశ్చలమైన జీవనశైలి అధిక బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. ఇది శరీరంలో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయటం కష్టతరం చేస్తుంది. కాబట్టి సాధారణ శరీరక శ్రమ పూర్తి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయం చేస్తుంది.