వెయిట్ లాస్ అవ్వటం కోసం జంక్ ఫుడ్ అండ్ ఎక్కువగా షుగర్ పదార్థాలు తీసుకోవటం మానేయాలని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.పుష్కలంగా నీరు తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. మీ ఆహారంలో ఫైబర్ జోడించడం వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా తాజాగా నిపుణులు చెప్పిన ఈ జీరో క్యాలరీ డ్రింక్స్ తీసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పుచ్చకాయలు కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి చాలా తక్కువ కేలరీలు అందుతాయి. అలాగే ఈ జ్యూస్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చు.
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తో పాటు గుండె జబ్బులు, మూత్రపిండాల్లో రాళ్లు సమస్యలను నివారిస్తాయి. నిమ్మకాయ రసంలో తక్కువ మొత్తంలో కెలరీలు లభించడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. అరటిపండు స్మూతీ పాలు తాగితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో కూడా చాలా తక్కువ మొత్తంలో కేలరేలు ఉంటాయి. అలాగే బనానా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలిగి ఉంటుంది. జామకాయలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారికి జామపండు మేలు చేస్తుంది.