ఈ రోజుల్లో ఎక్కువ అమ్మాయిలకి బీసీఓడీ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. బయట ఫుడ్స్ తినటం వల్ల కూడా ఈ సమస్య అందరిలో వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు హెల్తీ ఫుడ్ అసలు తినటం లేదు. బయట ఫుడ్డుకి చూస్తున్నారు. అందుకని ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. నేటి కాలంలోని జీవనశైలి కారణంగా మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్, గర్భశయానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. దీంతో బిడ్డను కనటం కూడా కష్టంగా మారుతుంది. మహిళల్లో వచ్చే అనేక సమస్యల్లో పిసిఒఎస్ అంటే పాలిసిస్టిక్ బోవారి సిండ్రోమ్ సమస్య ఎక్కువగా కనబడుతుంది. ఈ సమస్య చాలా చిన్న వయసు మహిళలను కూడా వేధిస్తోంది.

 హార్మోన్లు అసమతుల్యత కారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, బరువు పెరగటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మాత్రకే కాకుండా అనే లక్షణాలు, అనేక సమస్యలు కూడా కనబడుతాయంటున్నారు నిపుణులు మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. PCOS లక్షణాలలో ఒకటి ఏమిటంటే అది నిద్ర పై ప్రభావం చూపిస్తుంది. అయితే దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి PCOS ద్వారా మహిళలకు నిద్రలేమి సమస్య ఉంటుందంటున్నారు నిపుణులు. నిద్ర వచ్చినప్పటికీ కళ్ళు మళ్లీ మళ్లీ తెరుచుకుంటాయి. అంతేకాదు దీని కారణంగా మహిళలు స్లీప్ అప్నియాను కూడా ఎదుర్కోవలిసి వస్తుందంటున్నారు.

 దీని కారణంగా వారు నిద్రలో బిగ్గరగా గురక పెడుతుంటారు. ఎందుకంటే వారి శ్వాసకు ఆటంకం ఏర్పడుతుంది. హార్మోన్లు అసమాతుల్యత కారణంగా ఇదంతా జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల బరువు కూడా బాగా పెరిగిపోతుంటారు. అలాగే స్త్రి సర్వంలో మార్పు, రొమ్ము పరిమాణం తగ్గడం, కండరాలు పెరగటం, ఛాతీ, ముఖంపై వెంట్రుకలు పెరగటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మూడ్ లో మార్పు కూడా PCOS ప్రాధాన లక్షణం. ఈ పి సిఓఎస్ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా స్త్రీ చిరాకు, మానసిక కల్లోలం, నిరాశ మొదలైన వాటిని అనుభవించాల్సి వస్తుందంటున్నారు. PCOS కారణంగా అలసట కూడా కలుగుతుందని చాలా కొద్దిమంది మహిళలకు తెలుసు. పిసిఓఎస్ తో బాధపడుతున్న మహిళలు నిద్రలేమి కారణంగా తరచుగా అలసిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: