వ్యాయామం చేయటం అనేది చాలా మంచి అలవాటు. వ్యాయామం చేసిన వెంటనే మంచినీళ్లు అస్సలు తాగకూడదు. ఆ ఆవేశంలో మంచినీళ్లు తాగటం వల్ల గుండె సమస్య వస్తుంది. కాబట్టి వెంటనే కాకుండా ఒక్క అరగంట గ్యాప్ ఇచ్చి మంచి నీళ్లు తాగండి. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత రోజుల్లో అందం, ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకోసం ప్రతి రోజు వ్యాయాములు, జిమ్ లో రకరకాల వర్కవుట్లు చేస్తున్నావారు చాలా మందే ఉంటారు. ఇవి శరీరానికి బలాన్ని, మానసిక వికాసాన్ని కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే కొందరు వ్యాయామాల సందర్భంగా బాడిని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి మధ్య మధ్యలోనే కాకుండా... వర్కట్స్ పూర్తి కాగానే వెంటనే నీళ్లు తాగేస్తుంటారు. ఇలా చేయటం మంచిది కాదంటున్నారు హెల్త్ అండ్ ఫిట్ నెస్ నిపుణులు. ఎందుకో చూద్దాం. సాధారణంగా వ్యాయామాలు చేసేటప్పుడు శరీరం నుంచి చెమట బయటకు పోతుంది. దీంతో నీరు మాత్రమే కాకుండా, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ లు కూడా బయటకు పోతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ సందర్భంలో ఎక్సెర్ సైజ్ ముగిసిన వెంటనే నీళ్లు తాగితే...

 అప్పటికే బాడీ లోని ఎలక్ట్రోలైట్ కంటెంట్ తగ్గి ఉండటం వల్ల, ఒక్కసారిగా నీటి శాతం పెరగటం వల్ల కండరాల నొప్పులు, తలనొప్పి, తల తిరగటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వెంటనే నీరు తాగవద్దు. వ్యాయామం తర్వాత బాడీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వెంటనే నీళ్లు తాగితే కణజాలంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది కండరాళ్లు పట్టేసేందుకు కారణం అవుతుంది. అందుకే వర్కవుట్స్ పూర్తయ్యాక కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు నీరు తాగకపోవటం మంచిది. వర్కవుట్స్ చేసిన వెంటనే శరీరంలో తగ్గిన శక్తి, ఎలక్ట్రోలైట్ లు తక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: