పిల్లలు ఒంటరిగా కూర్చున్నారు అంటే ఏదో ఒక కారణం తప్పకుండా ఉండే ఉంటుంది. ఆ సమస్య ఏంటో తెలుసుకుని పెద్దవాళ్లు నచ్చ చెప్పాలి. ఏ సమస్య అయినా గానీ నాతో చెప్పి పిల్లలను బాగా చూసుకోవాలి. సహజంగానే పిల్లలు పిల్లలు బయట ఆడుకోవటానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే కొందర బయట అడుగు కూడా పెట్టరు. అలాగనీ తల్లిదండ్రులతో, ఇంట్లో ఉన్న ఇతర పిల్లలతో కూడా ఆడుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ పిల్లలను తిడుతుంటారు. బయట పిల్లలతో ఆడుకోకపోతే ఎలా? లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది అంటుంటారు.

 అయితే అలా చేయకూడదు అంటున్నారు మానసిక నిపుణులు. ముందుగా వారు అలా ఎవరితో మాట్లాడకపోవటానికి, ఒంటరిగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోవాలని చెబుతున్నారు. చైల్డ్ సైకాలజి ప్రకారం... పిల్లలు ఒంటరిగా ఉండేందుకు గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం. పిల్లలను అవమానించేలా మాట్లాడటమో, ఇతరులతో పోలీస్తూ తిట్టటమో చేస్తుంటారు కొందరు. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్లినా... ఈరోజు ఎలాగో ఉత్సాహంగా ఉన్నావంటూ చులకన చేస్తుంటారు. నాలుగురిలో ఉన్నప్పుడు పిల్లలు దగ్గరకు వస్తే ఎన్నడూ లేనిది అందరిలో కలిసేందుకు ధైర్యం చేశావంటూ నెగిటివ్ ఫీలింగ్ తో అంటుంటారు. అయితే ఇలా చేయటం, వ్యంగ్యంగా మాట్లాడుతూ చులకన చేయటం,

అవమానించటం టీనేజర్ల మనసును గాయపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. టీనేజర్స్ ను స్కూల్లో ఏం చేశావు. ఆ సమయంలో ఎందుకలా మాట్లాడావు. అలా కాకుండా ఇలా చేయాలి అంటూ తరచుగా ఏదో ఒకటి అంటూ ఉండటం వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అలా అడుగుతూ విసుగు తెప్పించేలా ప్రశ్నలు వేయకూడదు. అలా చేస్తే పిల్లలు వీళ్ళతో ఎప్పుడు ఇదే సమస్య అని భావిస్తారు. ఒంటరిగా ఉండేందుకు ట్రై చేస్తారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. రూమ్ లో నుంచి బయటకు రాకూడదు అనుకుంటారు. కాబట్టి సమయం సందర్భం లేకుండా పిల్లలను కుటుంబ సభ్యులు లేదా పేరెంట్స్ ప్రశ్నలతో విసిగించడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: