నిలబడి మూత్రం పోస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లే. నిలబడి మూత్రం పోస్తే పలు రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... సాధారణంగా మగవాళ్ళు వాష్ రూమ్ లో నిలబడి మూత్రం పోస్తారు. ముఖ్యంగా వెస్టర్న్ టాయిలెట్ లో మూత్రం పోశాక దాన్ని ఫ్లష్ చేస్తారు. ఇలా చేసినప్పుడు దాదాపు 7,550 వరకు చిన్న చిన్న మూత్రం బిందువులు గాలిలో కలుస్తాయి.


ఆ తర్వాత ఇవి వాష్ రూమ్ లో ఉండే టూత్ బ్రష్ లు, టవల్, టిష్యూ పేపర్లకు అంతటా వ్యాప్తిస్తాయి. కానీ ఆ చిన్న బిందువులు మన కంటికి కనిపించవు. వాటిలో చాలా హానికరమైన క్రిములు ఉంటాయి. ఆ మూత్రం డ్రాప్స్ వాష్ రూమ్ లో ఉండే వస్తువుల మీద పడడంతో వాటిని వాడేవారు అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రం పోసాక వెస్ట్రన్ టాయిలెట్ మూతను వేసి ఫ్లాష్ చేయాలి. ఇలా చేస్తే మూత్రం డ్రాప్స్ గాలిలో వ్యాప్తి చెందవు. పలు దేశాల్లో చాలా వరకు మగవారు కూర్చోనే మూత్రం పోస్తారు.


జర్మనీలో అయితే మగ పిల్లలకు చిన్నప్పటి నుంచే కూర్చొని మూత్రం పోయడం అలవాటు చేస్తారు. మరో విషయం ఏంటంటే వాష్ రూమ్ లో టూత్ బ్రష్ లు, సబ్బులు, బట్టలు లాంటివి పెట్టుకోకపోవడమే చాలా వరకు మంచిది. అలా చేసినట్లయితే ఎక్కువ వరకు హానికరమైన క్రీములు బాత్రూంలో వ్యాప్తి చెందవు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. చాలావరకు ఇలాంటి అలవాటు ఉన్నట్లయితే దానిని మార్చుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త నేపథ్యంలో.. ఇకపై నిలబడి మూత్రం పోసే పురుషులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి అంటున్నారు వైద్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: