ఉదయం లేచిన వెంటనే అందరూ బెడ్ కాఫీ అనేది ఎక్కువగా తాగుతారు. కాఫీ తాగటం వల్ల రిలీఫ్ గా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఉదయం లేచిన వెంటనే కాఫీ ని ఎక్కువగా తాగుతారు. కాఫీ తాగటం వల్ల మీ గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు కూడా రోజు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగితే ఈ వార్త మిమ్మల్ని సంతోషపరిచేదే. ఎందుకంటే రోజు కాఫీ ని మితంగా వినియోగించే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ అని కొన్ని వైద్య నిపుణులు తెలిపారు. చెప్పాలంటే మధ్యస్తంగా అంటే ప్రతిరోజు మూడు కప్పుల కాఫీ అంటే 200-300 mg కెఫిన్ ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

అయితే దాని కంటే ఎక్కువ కాఫీన్ ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు.ఈ మధ్యయనంలో కాఫీన్ వాడకం వల్ల కార్డియోమెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపింది. అయితే ఈ అధ్యయనంలో కెఫిన్ తో పాటు వ్యాయామం, మంచి నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి ప్రభావంతంగా ఉన్నాయని తెలింది. మితంగా కాఫీ తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుందని, అయితే కాఫీ ఎలా తయారవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు సీనియర్ నిపుణులు.ఉదాహరణకు ఉడకబెట్టడం ద్వారా తయారు చేసినా కాఫీ కంటే ఫిల్లర్ కాఫీ చాలా మంచిది, మరింత ప్రయోజనకరమైనదంటున్నరు నిపుణులు.

 కానీ కాఫీ ని ఎక్కువగా తీసుకోవటం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుందంటున్నారు. అలాగే ఆందోళన నిద్ర సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే రోజుల్లో ఎక్కువ కాఫీ తాగవద్దు. గుండె సంబంధిత వ్యాధులు పెరగడానికి అతిపెద్ద కారణం నేటి అనారోగ్య జీవనశైలి అని, ఇందులో బయటి నుంచి జంక్ ఫుడ్ తినటం, పొగతాగటం – తక్కువ నిద్ర, ఒత్తిడి వంటి అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రజలు చాలా చిన్న వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం బాధితులుగా మారుతున్నారు. తరువాత ఈ వ్యాధులు గుండెకు హాని కలిగిస్తున్నాయి. కానీ తక్కువ కాఫీ, కెఫిన్ రెగ్యులర్ తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఈ అధ్యాయనం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: