కర్పూరం ఎక్కువగా దేవుడికి హారతి ఇవ్వటానికి వాడుతూ ఉంటారు. పూజ అంతా అయ్యాక దేవుడికి హారతి ఇస్తారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా ఈ కర్పూరాన్ని ఎక్కువగా వాడతారు. కర్పూరాన్ని భారతీయుల పూజలో ఉపయోగిస్తారు. పూజా కార్యక్రమాల్లో భగవంతుడికి హారతి ఇవ్వటానికి వాడే పదార్థం. ఇది మైనములా తెల్లగా ఉంటుంది. రసాయనాలతో కృత్రిమంగా తయారైన ఈ కర్పూరం షూటైన వాసన వచ్చే పూజ ద్రవ్యము. కర్పూరం కాంఫర్ లారెన్ , సిన్నమోముం క్యాంఫోర అనే చెట్టు నుంచి లభ్యమవవుతుంది.


ఈ చెట్టు ఆకులు, కొమ్మలతో కర్పూరాన్ని రెడీ చేస్తారు. దీని ఆకులు చాలా పొడవుగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో కర్పూర ఆకులు ఎక్కువగా రాలుతుంటాయి. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో పక్వానిక వస్తాయి. మైసూర్, మలబార్ ప్రాంతాల్లో ఈ చెట్లు కనిపిస్తాయి. నీలగిరి కొండలో ఎక్కువగా పెంచుతారు. ఈ చెట్లు జపాన్, చైనా దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. పూజ సమయంలో కర్పూరాన్ని కాల్చినప్పుడు చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయని చాలామంది నమ్మకం. మంచి ఆలోచనలను తీసుకురావడానికి కర్పూరం సూచిస్తుంది.

తీపి వాసనతో కూడిన పొగ పూజను స్వచ్చంగా అండ్ ప్రత్యేకంగా భావిస్తారు. అయితే కర్పూరం వాసన ఆరోగ్యానికి మంచిదేనా? అని చాలామందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా హెల్త్ ఎక్స్పర్ట్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం... కర్పూరం కేవలం పూజకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం వాసన తలనొప్పి నుంచి ఉపశ్రమమం పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటి, అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హెయిర్ ను ఆరోగ్యంగా ఉంచటంలో మేలు చేస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు తరచూ చెబుతుంటారు. కర్పూరం స్మిర్ ఆందోళన, స్ట్రిస్ ను తగ్గిస్తుంది. మానసిక సమస్యలను పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: