ప్రపంచ వ్యాప్తంగా ఏటా అత్యధిక మరణాలకు గుండె జబ్బులు, స్ర్టోక్ కారణం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో స్ర్టోక్ తీవ్రమైన ముప్పుగా మారింది. ఇది 30 ఏళ్లలోపు వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బ్రెయిన్ స్ర్టోక్ తీవ్రమన సమస్య అని.. మెదడుకు రక్తం సరఫరా చేయడంలో అంతరాయం కలిగిస్తుందని.. లేకపోతే మెదడులో రక్త స్రావానికి కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


మెదడులోని లోని భాగాలకు ఆక్సిజన్ అందదని.. దాని కారణంగా మెదడులోని కణాలు చనిపోవడం ప్రారంభమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతక చెడు ప్రభావాలను కలిగిస్తుంది. గత దశాబ్దంలో యువతలో స్ర్టోక్ కేసులు విపరీంగా పెరిగాయని.. అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ధూమపానం, మద్యపానం, మధు మేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్  కారణంగా స్ర్టోక్ ప్రమాదం పెరుగుతుందని.. దాని బారిన పడకుండా ఉండేందుకు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలని, డైట్ ని తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


స్ర్టోక్ లక్షణాలు కనిపించిన సమయంలో ఆలస్యం చేయకుండా సకాలంలో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దూమ పానం, మద్యపానం చేయకుండా దూరంగా ఉంటే స్ర్టోక్ ప్రాణాంతకం మాత్రమే కాదు.. ప్రాణాలతో బయట పడిన వారు పక్షవాతం తదితర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.


స్ర్టోక్ లక్షణాలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే సకాలంలో చికిత్స మెదడుకు శాశ్వత నష్టాన్ని నిరోధించవచ్చు.  స్ర్టోక్ తొలి సంకేతంగా తీవ్రమైన తలనొప్పి తో పాటు తరచూ వికారం, వాంతులు , మూర్చ సైతం స్ర్టోక్ సంకేతం కావొచ్చని పేర్కొంటున్నారు. వెంటనే రక్తపోటుని పరీక్షించుకోవాలని చెబుతున్నారు. హైబీపీ కూడా స్ర్టోక్ కు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.  చేతులు, కాళ్లు బలహీనంగా ఉండటం, తిమ్మిరి అనిపిస్తుంది.  శరీరంలో ఒక భాగం  అకస్మాత్తుగా బలహీనంగా ఉండటం.. తిమ్మిరిగా ఉండటం దీని సంకేతంగా చెప్పుకోవచ్చు. ముఖం, ఒక చేయి, ఒక కాలు  ఒకవైపు జరుగుతుందని పేర్కొంటున్నారు. అకస్మాత్తుగా తల తిరగడం, బ్యాలెన్స్ కోల్పోవడం, తలనొప్పితో పాటు నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే.. వెంటనే జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: