చాలామంది బీరకాయ కర్రీ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరికొంతమందికి మాత్రం బీరకాయి అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ బీరకాయి తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా భారత్లో డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ బాధితుల సంఖ్యను పరిగణంలోకి తీసుకుంటే, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని కూడా పిలుస్తారు. జీవనశైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు వల్ల వచ్చే ఈ వ్యాధి ఎక్కువగా జన్యుపరమైనది. ఈ జీవితకాల వ్యాధిని నయం చేయలేము.

 కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా దీనిని కచ్చితంగా నియంతరించవచ్చు. డయాబెటిస్ ను నియంతరించడానికి ప్రజలు ఎన్నోరకాల డైట్ ను ఫాలో అవుతుంటారు. వాటిలో బీరకాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. సంవత్సరంలో 3 నెలలు మాత్రమే లభించే బీరకాయను లుఫ్ఫాను తరోయ్, తురై లేదా టోరీ అని కూడా అంటారు. అయితే దీని శాస్త్రియ నామం లూఫా సిలిండ్రికా. ఇది డైటరి ఫైబర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ A, C, మెగ్నీషియం వంటి లక్షణాలతో నిండి ఉంది. దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల ఇది మధుమేహంతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

మధుమేహ రోగాలకు టారోయ్ జోషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా మధుమేహం వల్ల వచ్చే సమస్య నుంచి కూడా ఉపశ్రమమం పొందవచ్చు. అలాగే బీరకాయ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు లష్ఫా ప్రయోజకరంగా ఉంటుంది. బీరకాయను తినటం వలన కొలెస్ట్రాలను నియంతరించడమే కాకుండా కామెర్లు, పైల్స్, టీబీ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. లష్ఫాలో విటమిన్ సి, బీటా- కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షించటంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: