చాలామంది ఉదయం గ్రీన్ టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఉదయంనే లేచిన వెంటనే గ్రీన్ టీ తాగాలని అనుకుంటారు. మరికొంతమందికి మాత్రం గ్రీన్ టీ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ గ్రీన్ టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీను తప్పకుండా తాగండి. ప్రస్తుత రోజుల్లో జనాలు గ్రీన్ టీ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు అనేకం. గుండె జబ్బులు నయం చేయటంలో ఈ టి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి కాపాడుతుంది. గుండెలో కొవ్వు శాతం తగ్గిస్తుంది.

 గుండె, హోల్స్ ను క్లీన్ చేయటంలో తోడ్పడుతుంది. అలాగే రక్తపోటును నియంతరిస్తుంది. కీళ్ల నొప్పి, కీళ్లవాతం సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రీన్ టీ. ఎప్పుడైనా సరే గ్రీన్ ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. టానిన్లు అని పిలవబడే పోలీఫెనాల్స్ కడుపులో ఆమ్లాన్ని పెంచి. కడుపునొప్పి, వికారం, మండే అనుభూతి లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. కాగా భోజనం మధ్య లేదా భోజనం తరువాత గ్రీన్ టీ తాగటం మంచిది. మార్నింగ్ ఈ టీ తాగటం వల్ల కాలేయం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

 గ్రీన్ టీ ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు కూడా తీసుకోవచ్చు. అయితే గ్రీన్ టీ రుచి కాస్త చేదుగా ఉంటుందన్న విషయం తెలిసింది. కాగా పలు పదార్థాలు దీనిలో కలిపి తీసుకుంటే గ్రీన్ టీ రుచిని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం... గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తాగటం వల్ల రుచిని పెంచుకోవచ్చు. కేవలం రుచి మాత్రమే కాకుండా నిమ్మరసం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసం గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్ ను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: