ప్రస్తుతం అంతా టెక్నాలజీ మయం అయింది. ఏ పని చేయాలన్నా ఏదో ఒక గాడ్జెట్ ఉపయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాళ్ల డెస్క్ టాప్, ల్యాప్ టాప్ యూస్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. వీటి ద్వారానే కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. తమ జీవిత లక్ష్యాన్ని చేరుతున్నారు. అయితే డబ్బు సంపాదించాలన్న ఆరాటంతో పాటు వివిధ రకాల కారణాల వల్ల ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు.
ముఖ్యంగా మనం వాడే ల్యాప్ టాప్ వాడేవారిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. అయినా కొందరికి తప్పడం లేదు. అయితే విధుల కారణంగా ల్యాప్ ట్యాప్ ను యూజ్ చేయడం వరకు ఓకే. కానీ కొందరు సరదా కోసం దీనిని ఒళ్లో పెట్టుకొని మరీ వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల సాధారణ అనారోగ్యాలే కాకుండా సంతానోత్పత్తికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వును డేమ్ హెల్త్ కు చెందిన వైద్యులు రూబీ యాదవ్, డైటీషియన్ అండ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ మల్హోత్రా అనే ఇద్దరు దీనిపై పరిశోధనలు నిర్వహించారు. ల్యాప్ ట్యాప్ ను ఎక్కువగా ఒళ్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వారు వివరించారు. ల్యాప్ టాప్ నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత రిలీజ్ అవుతుంది. ఇది వంధత్వాన్ని ప్రోత్సహిస్తోంది. క్రమంగా స్ర్టోటల్ హైపర్టెర్మియాకు కారణం అవుతుంది. అసాధారణ ఉష్ణోగ్రత బయటకు రావడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా ల్యాప్ టాప్ యూజ్ చేసే వ్యక్తి డీఎన్ఏపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుంది.
ఒళ్లో పెట్టుకొని పనిచేసే వారి వృషణాల వద్దే ల్యాప్ టాప్ ఉంటుంది కాబట్టి.. స్మెర్మాటోజెనిసిస్ కు ఆటంకం ఏర్పడి తద్వారా స్మెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇది క్రమంగా సంతాన లేమికి కారణం అవుతుంది. అయితే ల్యాప్ టాప్ ను ఒళ్లో కాకుండా ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సరదా కోసం ఒళ్లో పెట్టుకొని పని చేయడం, సినిమాలు చూడటం వంటివి చేయోద్దని హెచ్చరిస్తున్నారు.