ఈ కూరగాయతో ఎక్కువగా కూర, కారం చేసుకుని తింటారు. వంకాయకి ఆ సీజన్.. ఈ సీజన్ అని ఏమీ ఉండదు... ఏడాది మొత్తం దొరుకుతుంది. చలికాలంలో దీన్ని చాలా మంది తింటారు. ఎందుకంటే ఇది బ్లడ్ లో చక్కెరను నియంతరించగలదు... అలాగే గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది. అయితే, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయను దూరం పెట్టాలి. ఎలాంటి వారు తీసుకోకూడదు ఇక్కడ తెలుసుకుందాం. దురదలు, స్కిన్ ఎలర్జీ ఉన్నవారు వంకాయతో చేసిన వంటకాలను తినకూడదు.
లేకపోతే వారి అలెర్జీ ఇంకా పెరుగుతుంది. డిప్రెషన్ తో బాధపడేవారు కూడా ఈ వంకాయను తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు మందులు ఎక్కువగా తీసుకుంటారు. వంకాయ శరీరానికి చేరి, మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తం ఎక్కువగా ఉండేవారు వంకాయను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్ సమస్యలతో బాధపడేవారు వంకాయను దూరం పెట్టాలి. ముఖ్యంగా, కడుపు నొప్పితో బాధపడేవారు దీనిని తినకుండా ఉండటమే మంచిది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు వంకాయని అసలు తినకండి. పొరపాటున కూడా దానిని టచ్ చేయకండి.