నాచురల్ గా పెరుగుని ఎక్కువగా తింటూ ఉంటారు. కూరాన్నం అయిన తరువాత క పెరుగు ని ఎక్కువగా తింటారు. మరి కొంతమందికి పెరుగు అంటే అసలు ఇష్టం ఉండదు. మరికొంతమంది పెరుగు కోసమే చూస్తారు. రాత్రిపూట పెరుగుని తినవచ్చా లేదా తెలుసుకుందాం. చాలామందికి పెరుగు అంటే ఇష్టంఉంటుంది. కొందరైతే పెరుగు లేనిదే అన్నం తినరు. అన్నం చివరన పెరుగు లేకుండా... భోజనం ముగించరు. ఇక పెళ్లిలు, ఫంక్షన్లకైతే పెరుగు ఉండాల్సిందే. అయితే చాలామంది మధ్యాహ్నం తో పాటు రాత్రి కూడా పెరుగు తింటారు.

 మధ్యాహ్నం తింటే మంచిదే కానీ రాత్రి తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రిపూట కార్డ్ తినటం వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాతి పూట పెరుగు తినటం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. పెరుగులో ఉండే టైరమైన మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీన్ని కారణంగా త్వరగా నిద్ర పట్టగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పెరుగు శరీరానికి ప్రోటీన్లను అందించే అద్భుతమైన ఆహారం. అయితే, ఇందులో కొవ్వు కూడా ఉంటుంది. రాత్రిపూట మీ శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది.

 శారీరక స్టమ లేనప్పుడు దీన్ని తినటం వల్ల ఆ కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. ఇలా బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట పెరుగు తినకుండా ఉండాలి. మీరు దగ్గు లేదా జలుబు తో బాధపడుతుంటే రాత్రి వేళ పెరుగు అసలు తినకూడదు. అలాగే రాత్రిపూట పెరుగు తీసుకుంటే చాలామందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు. దీనికి ప్రధాన కారణం పెరుగులో ఉండే చక్కెర సమ్మేళనం అయినా లాక్టోస్ ను కొంతమంది శరీరాలు అంగీకరించకపోవడమే. దీన్నే 'లాక్టోస్ ఇంటాలరెన్స్ ' అంటారు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ, మన శరీరం లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: