సోషల్ మీడియాలో చెప్పే అన్ని రకాల హోమ్ రెమెడీస్ ను ఫాలో అవటం సరైనది కాదు. ముఖ్యంగా ఈ ఐదు రెమెడీస్ కు దూరంగా ఉండండి. లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. షుగర్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఫేస్ పై స్క్రబ్ చేస్తే మాత్రం నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఫేస్ పై రాస్తే గరుకుగా ఉండే స్కిన్ కణాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. దీంతో స్కిన్ మరింతగా సున్నితంగా మారుతుంది. కాగా ఫేస్ షైనింగ్ కోసం షుగర్ వాడకపోవటం మంచిది. టమాటా జ్యూస్ చాలామంది ఫేస్ పై రాస్తుంటారు.
దీంతో స్కిన్ ప్రకాశమంతంగా మెరిసిపోతుందని పలువురి భావన. అవును ఇది వాస్తవమే. టమాటా లో ఉండే బ్లీచింగ్ స్కిన్ ను క్లీన్ చేసి తాజా లుక్ ను ఇస్తుంది. కానీ టమాటాను డైరెక్ట్ ముఖంపై రాయటం వల్ల దీనిలో ఉండే యాసిడ్ మీ స్కిన్ సహజ పిహెచ్ లెవెల్ ను పాడు చేస్తుంది. దీంతో చర్మంపై చికాకుగా అనిపించడం, పొడి భారతం లాంటివి కనిపిస్తాయి. ఫేస్ పై మచ్చలను వదిలించుకునేందుకు బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. చాలామంది బేకింగ్ సోడాను స్క్రబ్ గా యూజ్ చేస్తారు. కానీ స్కిన్ ఆయిల్ ను కోల్పోతుంది. ఫేస్ లో సునీతత్వం ఏర్పడుతుంది. దీంతో స్కిన్ పొడిబారి నిర్జివంగా అవుతుంది.